శ్రీరెడ్డి వ్య‌వ‌హారంపై నోరు విప్పిన జ‌న‌సేనాని

pawan
Spread the love

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పెద‌వి విప్పారు. టాలీవుడ్ లో సంచ‌ల‌నంగా మారిన శ్రీరెడ్డి ఉదంతంపై స్పందించారు. టాలీవుడ్ లో కాస్ట్ కౌచింగ్ వ్య‌వ‌హారంపై త‌న అభిప్రాయం వెల్ల‌డించారు. అసిఫాపై జ‌రిగిన అత్యాచారాన్ని నిర‌సిస్తూ ఆయ‌న మౌన ప్ర‌ద‌ర్శ‌న చేశారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడిన ప‌వ‌న్ ఇండ‌స్ట్రీలో తాజా ప‌రిణామాల‌ను ప్ర‌స్తావించారు. ఇండస్ట్రీలో అన్యాయం జరిగితే చట్టాలను ఆశ్రయించాలన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా కోర్టుకి వెళ్ళవచ్చని సూచించారు. తాను మ‌ద్ధ‌తు ఇస్తాన‌ని తెలిపారు. అదే స‌మ‌యంలో టీవీలో చ‌ర్చ‌ల‌కు వెళ్లి ర‌చ్చ చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. అలాంటి ప‌ద్ధ‌తి సరికాద‌న్నారు. గ‌తంలో కూడా తాను ఇలాంటి ప‌రిణామాలు చూశాన‌ని, అనేక‌మంది అమ్మాయిల‌కు అన్యాయం జ‌రిగితే అడ్డుకున్న ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయ‌న్నారు.

కథువా ఘటనను కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. త‌క్ష‌ణం ప్ర‌ధాని మోడీ, అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు స్పందించాలని పవన్ డిమాండ్ చేశారు. స్పందించ‌డంలో జాప్యం జ‌ర‌గ‌డం మూలంగా ప్ర‌భుత్వ పెద్ద‌లు నిందితుల‌కు వ‌త్తాసు ప‌లుకుతున్న‌ట్టుగా ఉంద‌ని విమ‌ర్శించారు. మహిళల కోసం బలమైన చట్టాలు తీసుకురావాలని కోరారు. జనసేన పార్టీ మహిళలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.మ‌హిళా హ‌క్కుల ర‌క్ష‌ణ‌లో భాగ‌స్వాముల‌వుతామ‌ని తెలిపారు.


Related News

pawan madhavi latha

క‌న్నీరు పెట్టుకున్న నాగ‌బాబు

Spread the loveటాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం కొత్త మ‌లుపు తిరిగింది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మీద విమ‌ర్శ‌లుRead More

pawan

శ్రీరెడ్డి వ్య‌వ‌హారంపై నోరు విప్పిన జ‌న‌సేనాని

Spread the loveజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పెద‌వి విప్పారు. టాలీవుడ్ లో సంచ‌ల‌నంగా మారిన శ్రీరెడ్డి ఉదంతంపై స్పందించారు.Read More

 • బీజేపీకి మ‌రో ఎదురుదెబ్బ‌
 • కేసీఆర్ కొండకి గురిపెట్టారు..
 • సీఎం అలా మాట్లాడ‌కూడ‌దు…
 • ప్రొఫెసర్ అయ్యుండేవాడిని…
 • కత్తి మహేష్ పై దాడి
 • ఐలవ్యూ మెసేజ్ వివాదంలో కత్తి మహేష్
 • ఇరుక్కున్న గజల్స్ శ్రీనివాస్
 • కేసీఆర్ తో పవన్ కళ్యాణ్ ఏం చెప్పినట్టో..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *