బీజేపీకి మ‌రో ఎదురుదెబ్బ‌

nagam
Spread the love

బీజేపీ కి ఎదురుదెబ్బ త‌గిలింది. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఆ పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది. ప‌లువురు నేత‌లు జారిపోతున్నారు. ఇక తాజాగా తెలంగాణాలో కూడా పెద్ద దెబ్బే త‌గిలింది. కీల‌క నేత పార్టీకి దూర‌మ‌య్యార. సీనియ‌ర్ నాయ‌కుడు నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు ఫ్యాక్స్‌ ద్వారా రాజీనామా లేఖను పంపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాటం చేయడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను బీజేపీ ప్రస్తావించడం లేదని, అనుచరులు, కార్యకర్తల అభీష్టం మేరకే బీజేపీకి రాజీనామా చేశానని నాగం చెప్పారు.

కొంతకాలంగా నాగం బీజేపీకి దూరంగా ఉంటున్నారు. ఆయన బీజేపీలో చేరినప్పటి నుంచి ఆ పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. బీజేపీ తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన అనేక సార్లు ఆరోపించారు. నాగంతో సహా పలువురు ముఖ్య నేతలు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండడంతో కాంగ్రెస్‌లో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపి నాగం జనార్ధన్‌రెడ్డితో సహా జిల్లాకు చెందిన పలువురు నేతలను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవడానికి అధిష్టానం వద్ద ఆసక్తి కనబర్చడంతో వీరి చేరికకు మార్గం సుగుమమైనట్లు సమాచారం.

ఇప్ప‌టికే డీకే అరుణ ఆధిప‌త్యం ఉన్న ప్రాంతంలో కొద్దిరోజుల క్రితం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా నాగం జ‌నార్థ‌న్ రెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరుతుండ‌డంతో ముగ్గురు కీల‌క‌నేత‌లు ఒకే గూటికి చేరుతుండ‌డం విశేషం.


Related News

pawan madhavi latha

క‌న్నీరు పెట్టుకున్న నాగ‌బాబు

Spread the loveటాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం కొత్త మ‌లుపు తిరిగింది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మీద విమ‌ర్శ‌లుRead More

pawan

శ్రీరెడ్డి వ్య‌వ‌హారంపై నోరు విప్పిన జ‌న‌సేనాని

Spread the loveజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పెద‌వి విప్పారు. టాలీవుడ్ లో సంచ‌ల‌నంగా మారిన శ్రీరెడ్డి ఉదంతంపై స్పందించారు.Read More

 • బీజేపీకి మ‌రో ఎదురుదెబ్బ‌
 • కేసీఆర్ కొండకి గురిపెట్టారు..
 • సీఎం అలా మాట్లాడ‌కూడ‌దు…
 • ప్రొఫెసర్ అయ్యుండేవాడిని…
 • కత్తి మహేష్ పై దాడి
 • ఐలవ్యూ మెసేజ్ వివాదంలో కత్తి మహేష్
 • ఇరుక్కున్న గజల్స్ శ్రీనివాస్
 • కేసీఆర్ తో పవన్ కళ్యాణ్ ఏం చెప్పినట్టో..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *