Main Menu

కేసీఆర్ కొండకి గురిపెట్టారు..

Spread the love

తెలంగాణా ముఖ్య‌మంత్రి ముంద‌డుగు వేశారు. దేశంలో రాజ‌కీయ నేత‌లంతా ఎదురుచూస్తున్న నిర్ణ‌యాన్ని ఆయ‌న ప్ర‌క‌టించారు. పిల్లి మెడ‌లో ఎవ‌రు గంట కడ‌తారో అన్న‌ట్టుగా క‌నిపించిన సీన్ ఇప్పుడు ఒక్క‌సారిగా మారిపోయింది. కాంగ్రెస్, బీజేపీ యేత‌ర ఫ్రంట్ కి ఆయ‌న రంగం సిద్ధం చేశారు. దాంతో దేశ రాజ‌కీయాల్లో ఇదో కొత్త మ‌లుపుగా భావింవ‌చ్చు. దేశాన్ని 71ఏళ్ల కాలంలో కాంగ్రెస్, బీజేపీ ప్ర‌భుత్వాలు నాశ‌నం చేశాయ‌ని, ప్ర‌త్యామ్నాయం అవ‌స‌రం చాలా ఉంద‌ని చెబుతూ దానికి తానే నాందిప‌లుకుతాన‌ని, త్వ‌ర‌లోనే స‌మావేశం కూడా ఏర్పాటు చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో మ‌మ‌తాబెన‌ర్జీ అండ‌గా ఉంద‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న కూడా రావ‌డం అన్నీ క‌లిసి కేసీఆర్ జాతీయ రాజ‌కీయ దృష్టి కోణం క‌నిపిస్తోంది. ఆయ‌న భ‌విష్య‌త్తులో కొత్త రాజ‌కీయ శ‌క్తిగా ప‌రిణ‌మించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

దేశంలో ప్ర‌స్తుతం బీజేపీ మీద వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌భావం నిలుపుకుంటోంది. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ బ‌లం పుంజుకోవ‌డంలో వెనుక‌బ‌డుతోంది. దాంతో ఆ రెండు పార్టీల‌కు భిన్న‌మైన శ‌క్తిగా మూడో ఫ్రంట్ తో ముందుకు రావాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకోవ‌డం విశేషంగా మారింది వాస్త‌వానికి కేసీఆర్ చాలాకాలంగా ఎన్డీయేతో స‌ఖ్య‌త‌గా మెలిగారు. అంత‌కుముందు యూపీఏలో కేసీఆర్ భాగ‌స్వామ్య మంత్రి. అలాంటిదిప్పుడు హ‌ఠాత్తుగా కేసీఆర్ స్వ‌రం మార్చుకోవ‌డం వెనుక జ‌రుగుతున్న ప‌రిణామాలు ఆస‌క్తిగా ఉన్నాయి. వాస్త‌వానికి తెలంగాణాలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెరుగుతున్న త‌రుణంలో దానిని ప‌క్క‌దారి ప‌ట్టించి, ప్ర‌జ‌ల దృష్టిని జాతీయ రాజ‌కీయాల వైపు మ‌ళ్లించి, తెలంగాణాలో గ‌ట్టెక్కే ఎత్తుగ‌డ‌లు కేసీఆర్ వేస్తున్నార‌ని కొంద‌రు భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో దేశంలో కాంగ్రెస్, బీజేపీయేత‌ర రాజ‌కీయ పార్టీల‌కు కేంద్ర‌స్థానంగా మార‌డం ద్వారా పరిణామాల‌ను తన‌వైపు మ‌ల‌చుకునే ల‌క్ష్యం కూడా ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. రాజకీయ వ్యూహాల‌లో కేసీఆర్ ధిట్ట‌గా ఇప్ప‌టికే నిరూపితం అయ్యింది. ఇప్పుడు జాతీయ రాజ‌కీయాల్లో కూడా అడుగులేస్తున్న‌ట్టు ఆయ‌న బాహాటంగా ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో
ప్ర‌భావం, ఫ‌లితాలు ఆస‌క్తిదాయ‌క‌మే.

కేసీఆర్ నిర్ణ‌యం ఆయ‌న‌కు మేలు చేయ‌డ‌మే త‌ప్ప పెద్ద‌గా న‌ష్టం చేకూర్చే అవ‌కాశం లేదు. దానికి ప్ర‌ధాన‌కార‌ణం తెలంగాణాలో ఆయ‌న రెండు జాతీయ ప‌క్షాల‌ను ఏకకాలంలో ఎదుర్కోవాల్సి ఉన్న నేప‌థ్యంలో జాతీయ స్థాయిలో వారికి చెక్ పెడితే తెలంగాణాలో ఆయ‌న పని కొంత సులువు అవుతుంది. జాతీయంగా ఫ‌లితాలు వ‌స్తే హ‌స్తిన‌, లేకుండా క‌నీసం హైద‌రాబాద్ వ‌ర‌కూ ఆయ‌న‌కు ఢోకా ఉండ‌దు. త‌ద్వారా త‌న‌కు మేలు జ‌రిగినా లేకున్నా, న‌ష్టం మాత్రం జ‌ర‌గ‌కుండా కేసీఆర్ ఎత్తులు వేస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి తెలుగు నేత‌లు, క‌మ‌ల్ హాస‌న్ వంటి కొత్త రాజ‌కీయ ప‌క్షాలు, ఇక మ‌మ‌తా, శిబూసోరెన్, రాజ్ థాక‌రే, బాద‌ల్ స‌హా అనేక పార్టీల నేత‌ల‌తో త‌నకున్న ప‌రిచాయ‌ల‌ను ఉప‌యోగించుకుని ఢిల్లీలో జెండా ఎగ‌రేసే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఏపీ వ‌ర‌కూ మాత్రం కేసీఆర్ ఆచితూచి అడుగులేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు, జ‌గ‌న్ ఇద్ద‌రితోనూ సంబంధాలు నెరుపుతూ ఎన్నిక‌ల త‌ర్వాత ఇద్ద‌రినీ క‌లుపుకుని పోవ‌డానికి త‌గ్గ‌ట్టుగా కేసీఆర్ ఆలోచ‌న చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. త‌మిళ‌నాడులోని ప‌క్షాల‌తో పాటు ఒడిశా సీఎంతో కూడా ఆయ‌న ట‌చ్ లో ఉన్న నేప‌థ్యంలో రాజ‌కీయ ప‌రిణామాల్లో కేసీఆర్ అడుగులు కొంత ప్ర‌భావం చూపింవ‌చ్చ‌ని తెలుస్తోంది. దాంతోజై తెలంగాణా అంటూ అస్తిత్వాన్ని నిరూపించ‌డం కోసం అనేక ఎత్తుల‌తో పైచేయి సాధించిన కేసీఆర్ ఇప్పుడు జై భార‌త్ అనే నినాదం ద్వారా ఏమేర‌కు ఫ‌లితాలు సాధిస్తారో చూడాలి.


Related News

కోర్టుకెళుతున్న చంద్ర‌బాబు!

Spread the loveఏపీ ముఖ్య‌మంత్రి కోర్టుకి హాజ‌రుకావాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. అందుకు తాముసిద్ధంగా ఉన్నామ‌ని మంత్రి నారా లోకేష్ ప్ర‌క‌టించారు.Read More

చేతులెత్తేసిన చంద్ర‌బాబు!

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. ఓవైపు కాంగ్రెస్ తో క‌ల‌వ‌డానికి ఆయ‌న ఆస‌క్తి చూపుతున్న‌ట్టుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *