ఇరుక్కున్న గజల్స్ శ్రీనివాస్

gazals
Spread the love

ఓ యువతిని బలవంతంగా వేదించిన లైంగిక వేధింపుల కేసులో గజల్స్ శ్రీనివాస్ ఇరుక్కున్నారు. అసభ్యంగా ప్రవర్తించి, ముద్దులు పెట్టి, కౌగిలించుకోవడానికి ప్రయత్నించి, వివస్త్రుడిగా మసాజ్ చేయమని వేదించారంటూ కుమారి అనే రేడియో జాకీ ఇచ్చిన ఫిర్యాదుతో గజల్స్ శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు. పంజాగుట్ట పోలీసులకు ఆలయవాణీ అనే వెబ్ రేడియోలో పనిచేస్తున్న మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్ట్ చేశారు. డిసెంబర్ 29న పూర్తి ఆధారాలతో ఆమె ఫిర్యాదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వీడియో సాక్ష్యాలు, వాట్సాప్ మేజేస్ లు సహా అనేక ఆధారాలు ఆమె సమర్పించినట్టు పోలీసులు తెలిపారు. కొద్ది సేపట్లో గజల్స్ శ్రీనివాస్ ని కోర్ట్ లో హాజరుపరచబోతున్నారు.

అయితే గజల్స్ శ్రీనివాస్ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తాను ఆ యువతిని సొంత బిడ్డలా చూసుకున్నానని చెబుతున్నారు. చిన్న నొప్పి ఉంటే ఆయింట్ మెంట్ రాయమన్నందుకు మసాజ్ అంటూ చిత్రీకరిస్తున్నారన్నారు. ఎందుకు అలా చేసిందో తెలియదని, తనకు చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు.

అయితే గజల్స్ శ్రీనివాస్ మీద పోలీసులు నమోదు చేసిన 354 ఏ, 354 వంటి అత్యాచార కేసులు నమోదయిన నేపథ్యంలో చిక్కుల్లో పడినట్టే భావించాలి.


Related News

gazals

ఇరుక్కున్న గజల్స్ శ్రీనివాస్

Spread the loveఓ యువతిని బలవంతంగా వేదించిన లైంగిక వేధింపుల కేసులో గజల్స్ శ్రీనివాస్ ఇరుక్కున్నారు. అసభ్యంగా ప్రవర్తించి, ముద్దులుRead More

pawan kcr

కేసీఆర్ తో పవన్ కళ్యాణ్ ఏం చెప్పినట్టో..

Spread the loveరాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు రాజ్‌భవన్‌లో గౌరవ విందు ఏర్పాటు చేశారు. శీతాకాల విడిదిలో భాగంగా నాలుగురోజుల భాగ్యనగరRead More

 • రేవంత్ రెడ్డిపై ఎదురుదాడి
 • రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదులు..
 • టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ఖ‌రారు!
 • కేసీఆర్ స‌ర్కారుపై సుప్రీం సీరియ‌స్
 • టీడీపీ జిల్లా అధ్యక్షులు వీరే…
 • పార్టీలో గుర్తింపు లేదని ప్రాణం తీసుకునేందుకు…
 • రాబోయే రెండు రోజులు వర్షాలే..
 • కాటమరాయుడితో కత్తిమహేష్ తగాదా
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *