సీఎం అలా మాట్లాడ‌కూడ‌దు…

nirmala
Spread the love

ఏపీలో బీజేపీ, టీడీపీ మ‌ధ్య హోదా తెచ్చిన వైరం చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు తెలంగాణాలోనూ అదే తంతు మొద‌ల‌య్యింది. టీఆర్ఎస్, బీజేపీకి మ‌ధ్య కూడా దూరం పెరుగుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. తాజాగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌తో బీజేపీ సీరియ‌స్ అయ్యింది. కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేరుగా కేసీఆర్ మీద కామెంట్స్ చేశారు.

కేసీఆర్‌ ఉపయోగించిన పదజాలం తనకు నచ్చలేదని కేంద్ర రక్షణ మంత్రి పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు అలా మాట్లాడటం సరికాదని చెప్పారు. ‘‘ప్రధాని మోదీని ఉద్దేశించి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు… నా దృష్టికి వచ్చాయి. వెంటనే మంత్రి కేటీఆర్‌కి ఫోన్‌ చేశాను. ఆ సమయంలో కేటీఆర్‌ నల్లగొండలో ఉన్నారు. మన దేశ ప్రధాని గురించి కేసీఆర్‌ అనుచితంగా మాట్లాడిన తర్వాత నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుండదని కేటీఆర్‌కు చెప్పాను. అసలు ఆదిభట్ల కార్యక్రమానికి నేను రావాలా? వద్దా? అని ప్రశ్నించాను. ఆయన నాతో వివరంగా మాట్లాడారు. ‘మా నాన్న పొరపాటున నోరు జారారు. ఆయన అలా మాట్లాడి ఉంటారని నేను అనుకోను’ అని కేటీఆర్‌ వివరణ ఇచ్చారు’’ అని నిర్మల వివరించారు.


Related News

nagam

బీజేపీకి మ‌రో ఎదురుదెబ్బ‌

Spread the loveబీజేపీ కి ఎదురుదెబ్బ త‌గిలింది. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఆ పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది. ప‌లువురు నేత‌లుRead More

kcr

కేసీఆర్ కొండకి గురిపెట్టారు..

Spread the loveతెలంగాణా ముఖ్య‌మంత్రి ముంద‌డుగు వేశారు. దేశంలో రాజ‌కీయ నేత‌లంతా ఎదురుచూస్తున్న నిర్ణ‌యాన్ని ఆయ‌న ప్ర‌క‌టించారు. పిల్లి మెడ‌లోRead More

 • సీఎం అలా మాట్లాడ‌కూడ‌దు…
 • ప్రొఫెసర్ అయ్యుండేవాడిని…
 • కత్తి మహేష్ పై దాడి
 • ఐలవ్యూ మెసేజ్ వివాదంలో కత్తి మహేష్
 • ఇరుక్కున్న గజల్స్ శ్రీనివాస్
 • కేసీఆర్ తో పవన్ కళ్యాణ్ ఏం చెప్పినట్టో..
 • రేవంత్ రెడ్డిపై ఎదురుదాడి
 • రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదులు..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *