టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా వారికే ఉంది..

laxman
Spread the love

ఎన్నికల ముందు అరచేతిలో స్వర్గం చూపిన కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజల ఆశలపై నీరు చల్లారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు.వివరాల్లోకి వెళితే, మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని వీఆర్‌ఎన్‌ గార్డెన్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం గిరిజన ఆత్మీయ అభినందన సభలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం బీజేపీకి తప్ప ఏ ఇతర పార్టీకి లేవన్నారు. మజ్లి్‌సను మట్టికరిపించే సత్తా కూడా బీజేపీకే ఉందన్నారు. హామీలను విస్మరించిన కేసీఆర్‌ ముస్లింల రిజర్వేషన్‌లను తెరపైకి తీసుకువచ్చి తగదాలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని పార్టీలు ముందుకొస్తుంటే కేసీఆర్‌ అసెంబ్లీలో అమోదం తెలిపి చేతులు దులుపుకున్నారన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ చరిష్మా పోయిందని, టీఆర్‌ఎస్ పై బ్రమలు తొలగిపోయాయని, టీడీపీ బలహీనపడిందని, ఇక భవిష్యత్తంతా బీజేపీదేనని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ 2019లో అధికారంలోకి రానుందని చెప్పారు. కాగా, రాష్ట్రంలో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ను కోరుతూ లక్ష్మణ్‌ ఆదివారం ఆయనకు లేఖ రాశారు.


Related News

modi kcr babu

మోడీ, బాబు మధ్యలో కేసీఆర్

Spread the loveనాలుగేళ్ల క్రితం మంచి మిత్రులుగా కనిపించిన నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు మధ్య ప్రస్తుతం ఉప్పూ నిప్పులా మారింది.Read More

pawan

పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు

Spread the loveజనసేన అధినేత పై కేసు నమోదయ్యింది. ఆయన చేసిన పోస్ట్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఏబీఎన్, టీవీ9,Read More

 • క‌న్నీరు పెట్టుకున్న నాగ‌బాబు
 • శ్రీరెడ్డి వ్య‌వ‌హారంపై నోరు విప్పిన జ‌న‌సేనాని
 • బీజేపీకి మ‌రో ఎదురుదెబ్బ‌
 • కేసీఆర్ కొండకి గురిపెట్టారు..
 • సీఎం అలా మాట్లాడ‌కూడ‌దు…
 • ప్రొఫెసర్ అయ్యుండేవాడిని…
 • కత్తి మహేష్ పై దాడి
 • ఐలవ్యూ మెసేజ్ వివాదంలో కత్తి మహేష్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *