Main Menu

వైసీపీ ఇంకెప్పుడు నేర్చుకుంటుందో..!

Spread the love

కొంద‌రు చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటారు. మ‌రికొంద‌రు అనుభ‌వంతో జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. కానీ వైసీపీ వ్య‌వ‌హారం చూస్తుంటే దానికి భిన్నంగా క‌నిపిస్తోంది. గ‌తంలో నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కామెంట్స్ ఏ స్థాయిలో క‌ల‌క‌లం రేపాయో అంద‌రికీ తెలుసు. చివ‌ర‌కు వైసీపీ ఓట‌మికి అవే కార‌ణ‌మ‌న్న‌ట్టుగా చిత్రీకరించ‌డానికి కూడా ప్ర‌య‌త్నం సాగింది. మీడియాలో జ‌గ‌న్ వ్య‌తిరేక‌ల ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉండ‌డం, అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు ప‌ట్ల సానుకూల‌త ఉన్న సంస్థ‌లే ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌డంతో వైసీపీ నేత‌లు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. మాట‌ల వ‌క్రీక‌ర‌ణ‌లే కాకుండా, స‌గం స‌గం స‌మాచారం ప్ర‌జ‌ల‌కు చేర‌వేయ‌డం ద్వారా అనేక అపోహ‌ల‌కు, అనుమానాల‌కు అవ‌కాశం క‌లుగుతుంది. గ‌తంలో జ‌రిగింది కూడా.

అయినా వైసీపీ నేత‌ల తీరు మార‌డం లేదు. తాజాగా కేంద్రం బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ పై వైసీపీ నేత‌ల విజ‌య‌సాయి రెడ్డి సానుకూలంగా స్పందించ‌డంతో ఆపార్టీకి కొంత న‌ష్టం జ‌రిగింది. అయితే ఆ కామెంట్స్ ఎక్క‌డ చేశార‌న్న‌ది ఎవ‌రిక తెలియ‌క‌పోయినా, కొన్ని సంస్థల్లో ప‌తాక శీర్షిక‌ల్లో వ‌చ్చేయ‌డం వైసీపీకి ఇబ్బందిక‌ర‌మే. ఆ త‌ర్వాత తాజ‌గా ఇంగ్లీష్ చానెళ్ల‌తో మాట్లాడుతూ మోడీ హోదా ఇస్తారంటూ బీజేపీ త‌రుపున వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వ‌కాల్తా పుచ్చుకోవ‌డం విస్మ‌యం క‌లిగిస్తోంది. వాస్త‌వానికి ప్ర‌స్తుతం ఏపీ వాసులు క‌మ‌ల ప‌ట్ల పూర్తి కాక‌తో ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో అరుణ్ జైట్లీ కామెంట్స్ పుండు మీద కారం చ‌ల్లిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో మోడీని, బీజేపీని స‌మ‌ర్థిస్తూ మాట్లాడే ప్ర‌తీ వాఖ్యం ప్ర‌జ‌ల్లో కొత్త సందేహాలు పుట్టిస్తుంది. అనుమానాలు క‌లిగిస్తుంది. అందులోనూ టీడీపీ స్థానాన్ని ఎన్డీయేలో వైసీపీ భ‌ర్తీ చేస్తుంద‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో అందుకు ఆస్కారం చాలా ఎక్కువ‌గా ఉంటుంది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన వైసీపీ నేత‌లు అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాజ‌కీయ‌, ఇత‌ర కార‌ణాలు వేరుగా ఉన్న‌ప్ప‌టికీ బీజేపీ ప‌ట్ల సానుకూల దృక్ప‌థం ప్ర‌ద‌ర్శించాల‌ని చూస్తే వైసీపీ పుట్టి మున‌గ‌డం ఖాయం. అందులోనూ వ‌రుస ప‌రిణామాల‌తో ఉక్కిరిబిక్కిర‌వుతూ డిఫెన్స్ లో ఉన్న టీడీపీకి ఏ చిన్న అవ‌కాశం ఇచ్చినా అది విప‌క్షం కోరి క‌ష్టాలు తెచ్చుకున్న‌ట్టే అవుతుంది. ఇప్ప‌టికే అవిశ్వాసం ,రాజీనామాలు అంటూ హ‌డావిడి చేస్తున్న పార్టీ నేత‌లు అదే స‌మ‌యంలో మీడియా ముందు చేస్తున్న వ్యాఖ్య‌ల్లో జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌ని గ్ర‌హించాలి. ఒకసారి ప్ర‌జ‌ల్లో అనుమానం పెరిగితే దానిని మ‌రింత రాజేయ‌డానికి మీడియాలోని మెజార్టీ సెక్ష‌న్ కాచుకుని కూర్చుంటుంది. అది గ‌మ‌నించ‌క‌పోతే వైసీపీ ఏరికోరి గోతిని త‌వ్వుకున్న‌ట్టే అని చెప్ప‌క త‌ప్ప‌దు.


Related News

వైసీపీ హోరు గాలి, టైమ్స్ నౌ తాజా స‌ర్వే

Spread the loveజాతీయ మీడియా సంస్థ‌ల స‌ర్వేల‌లో వైసీపీ హోరు గాలి వీస్తోంది. ఆపార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఖాయంగా క‌నిపిస్తోంది.Read More

వైసీపీ రెండో జాబితా ఎంపీ అభ్య‌ర్థులు

Spread the loveశ్రీకాకుళం- దువ్వాడ శ్రీనివాస్ విజ‌య‌న‌గ‌రం- బెల్లాని చంద్ర‌శేఖ‌ర్ విశాఖ‌ప‌ట్ట‌ణం-ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌ అన‌కాప‌ల్లి- డాక్ట‌ర్ స‌త్య‌వ‌తి కాకినాడ వంగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *