Main Menu

వైసీపీ ఓ అడుగు వేసిన‌ట్టే..

Spread the love

ఏపీ ప్ర‌త్యేక హోదా వ్య‌వ‌హారం హాట్ టాపిక్ అవుతోంది. హోదా వ‌స్తుందా రాదా అన్న‌ది ప‌క్క‌న పెడితే గ‌ట్టిగా పోరాడిన‌ట్టు క‌నిపించ‌డ‌మే ల‌క్ష్యంగా పార్టీల‌న్నీ పావులు క‌దుపుతున్నాయి. ఈ విష‌యంలో తాజాగా ఢిల్లీ కేంద్రంగా సాగించిన ధ‌ర్నాతో వైసీపీ ముంద‌డుగు వేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఆపార్టీ నేత‌లు ధృఢంగా నిల‌బ‌డి పోరాడ‌డంతో కొంత మైలేజీ ద‌క్కింది. మిత్ర‌ప‌క్షంతో టీడీపీ దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేని ప‌రిస్థితిలో స‌త‌మ‌త‌మ‌వుతుండ‌గా ఢిల్లీ కేంద్రంగా పోరాట పంథాను ఎంచుకోవ‌డంతో వైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్ట‌య్యింది. దాంతో ప్ర‌జ‌ల్లో కొంత సానుభూతి ద‌క్కించుకుంది.

అయితే ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం అంత త్వ‌ర‌గా స‌మ‌సిపోయే అంశం కాదు. పైగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ హ‌క్కుల విష‌యం కీల‌కం కాబోతోంది. దాంతో వైసీపీ కి ప్ర‌స్తుతం ల‌భించిన సానుభూతి తాత్కాలికంగా భావించాలి. ఆపార్టీ త‌గిన వ్యూహాల‌తో సాగితే క్రెడిట్ గేమ్ లో కొంత ఫ‌లితం ద‌క్క‌వ‌చ్చు. దానికి త‌గ్గ‌ట్టుగా తాజాగా ల‌భించిన ఫ‌లితాల‌ను ఉప‌యోగించుకోవాలి. అందుకు అనేక జాగ్ర‌త్త‌లు పాటించాలి. గ‌తంలో కూడా జ‌గ‌న్ కి ఇలాంటి అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ అందిపుచ్చుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. అయితే ఇప్పుడు ఎన్నిక‌ల సంవ‌త్స‌రంలో, అది కూడా జ‌న‌మంద‌రినీ ప్ర‌భావితం చేసే విష‌యంలో ప‌ట్టుద‌ల‌తో సాగితేనే ఆశించిన ఫ‌లితాలు వ‌స్తాయ‌న్న‌ది మ‌ర‌చిపోకూడ‌దు.

తెలుగుదేశం ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కొంత వెనుక‌బ‌డిన‌ట్టే క‌నిపిస్తోంది. పార్ల‌మెంట్ బ‌య‌ట‌, లోప‌లా సాగిస్తున్న సంద‌డి ఆపార్టీకి స‌హక‌రిస్తుంద‌ని చెప్ప‌లేని స్థితి క‌నిపిస్తోంది. దాంతో కొంత ఒత్తిడికి గుర‌వుతోంది. అదే స‌మ‌యంలో అవిశ్వాస తీర్మానం, రాజీనామాలు వంటి అస్త్రాలు సంధించ‌డం మొద‌ల‌యితే తెలుగుదేశం పార్టీకి మ‌రిన్ని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. దానిని దృష్టిలో పెట్టుకుని విప‌క్షం వ్య‌వ‌హ‌రించ‌గ‌లిగితే గ‌తంలోనే జ‌గ‌న్ ప్ర‌క‌టించిన‌ట్టుగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో హోదానే ప్ర‌ధాన ఎజెండాగా మార‌బోతోంది. విప‌క్షం నిర్థారించిన ఎజెండాతో ఎన్నిక‌ల‌కు వెళితే అపోజిష‌న్ కి కొంత అడ్వాంటేజ్ గా ఉండ‌బోతోంది.


Related News

వైసీపీ ఖాతాలో మ‌రో ఎమ్మెల్యే

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య‌లో మ‌రో నెంబ‌ర్ తోడ‌య్యింది. వాస్తవానికి అధికారికంగా 67మందిని గెలిపించుకున్న ఈRead More

కేసీఆర్ సీఎం అయితే చంద్ర‌బాబుకి క‌ష్టాలే!

Spread the loveత్వ‌ర‌లోనే టీడీపీ కండువా క‌ప్పుకోబోతున్నట్టు ప్ర‌చారంలో ఉన్న మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *