Main Menu

బాబు, జగన్ కూడా అదే నియోజకవర్గంలో…

jagancbn
Spread the love

ఏపీ ప్రతిపక్ష నేత ప్రజాసంకల్ప యాత్రలో ముందుకు సాగుతున్నారు. గడిచిన 60 రోజులుగా సాగుతున్న యాత్ర ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పూర్తికాగా,ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో సాగుతోంది. చిత్తూరు ఏపీ సీఎం సొంత జిల్లా కావడం, ప్రతీ ఏటా సంక్రాంతికి ఆయన కుటుంబంతో కలిసి సొంత ఊరు నారావారి పల్లెలో గడుపుతుండడం తెలిసిందే.

అయితే ఈసారి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా పండుగ చేసుకుంటుండడం విశేషంగా మారింది. వాస్తవానికి చంద్రబాబు చాలాకాలంగా కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నప్పటికీ ఆయన స్వగ్రామం మాత్రం చంద్రగిరి నియోజకవర్గంలో ఉంటుంది. ప్రస్తుతం అక్కడి నుంచి వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన 1983లో ఓటమి తర్వాత కుప్పం తరలివెళ్లారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా మరోసారి కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరికి బాబు వస్తుండగా, అక్కడికి సమీపంలోనే జగన్ కూడా పాదయాత్రం సందర్భంగా బస చేస్తుండడం ఆసక్తిదాయకం.

ముఖ్యమంత్రి చంద్రబాబు 13వ తేదీ చిత్తూరు, తిరుపతిలో పర్యటించి… సాయంత్రానికి నారావారిపల్లెకు చేరుకుంటారు. 14, 15 తేదీల్లో అక్కడే ఉంటారు. 16వ తేదీ కనుమ పండుగ విందు ఆరగించి అమరావతికి బయలుదేరతారు. ఇక… ప్రస్తుతం విపక్షనేత జగన్‌ షెడ్యూలు మార్పుల నేపథ్యంలో 15, 16 తేదీల్లో కూడా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలంలో జగన్‌ పర్యటించనున్నారు. ఇలా ప్రభుత్వాధినేత, ప్రతిపక్ష నేత ఇద్దరూ పండగ సమయంలో ఒకే నియోజకవర్గంలో ఉండడం విశేషమే. దాంతో ఆ రెండు రోజుల పాటు చంద్రబాబు అక్కడ ఉండగానే చంద్రగిరి జనం జగన్ ని ఏరీతిలో ఆశీర్వదిస్తారన్నది చర్చనీయాంశం కాబోతోంది.






Related News

Chandrababu-AP-police.jpeg

బాబు తీరుపై ఐపీఎస్ ల అసంతృప్తి

Spread the love4Sharesఏపీకి మ‌రో పోలీస్ బాస్ అనివార్యం అవుతోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు బాసుల ప‌ద‌వీకాలం ముగియ‌గా, తాజాగా మాల‌కొండ‌య్య‌కుRead More

jyothi survey

ఆంధ్ర‌జ్యోతి స‌ర్వే వెనుక అస‌లు క‌థ‌

Spread the love11Sharesఆంధ్ర‌జ్యోతి స‌ర్వేలో టీడీపీ గెల‌వ‌క‌పోతే ఆశ్చ‌ర్యం గానీ, అధికార పార్టీకి మ‌రోసారి అంద‌లం ద‌క్క‌డంలో ఎటువంటి సంభ్ర‌మాశ్చ‌ర్యంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *