Main Menu

జ‌గ‌న్ స‌భ‌లో ఎందుక‌లా?: టీడీపీ అంత‌ర్మ‌థ‌నం

Spread the love

టీడీపీకి గ‌ట్టిప‌ట్టున్నట్టుగా భావించిన చోట ఇప్పుడ‌ ఆపార్టీ క‌ల‌వ‌ర‌ప‌డుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర స‌భ‌ల‌తో ప‌చ్చ‌దండులో ప్ర‌కంప‌న‌లు పుడుతున్నాయి. ముఖ్యంగా జ‌గ‌న్ స‌భ‌ల‌కు ఇన్నాళ్లుగా అనేక చోట్ల జ‌నాద‌ర‌ణ ఉత్సాహంగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ న‌ర్సీప‌ట్నంలో ప్ర‌జ‌ల స్పంద‌న అనూహ్యంగా ఉండ‌డం అధికార పార్టీని సైతం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆందోళ‌న‌క‌లిగిస్తోంది. చివ‌ర‌కు వ‌ర్షం వ‌చ్చిన‌ప్ప‌టికీ జ‌నం క‌ద‌ల‌క‌పోవ‌డం గ‌మ‌నించిన త‌ర్వాత టీడీపీ నేత‌ల‌కు మింగుడుప‌డ‌డం లేదు.

స‌హ‌జంగా ఎవ‌రైనా నాయ‌కుడి స‌భ‌కు జ‌నాన్ని త‌ర‌లించిన క్ర‌మంలో వారికి ఇబ్బంది క‌లిగిన‌ప్పుడు ఆ స‌భ‌ల నుంచి జ‌నం జారిపోతుంటారు. చంద్ర‌బాబు నిర్వ‌హిస్తున్న అన్ని అధికారిక స‌భ‌ల్లోనూ ఇది క‌నిపిస్తుంది. బాబు ఉప‌న్యాసం పూర్త‌య్యే స‌రికి హాజ‌ర‌యిన వారిలో 10శాతం కూడా మిగులుతున్న‌ట్టు క‌నిపించ‌దు. అయినా ఆయ‌న మాత్రం టీవీ లైవ్ లో చూసే జ‌నం కోస‌మే అన్న‌ట్టుగా త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించ‌డానికి అల‌వాటుప‌డ్డారు. తొలుత ఖాళీ అయిపోతున్న స‌భా ప్రాంగ‌ణాలు చూసి క‌ల‌వ‌ర‌ప‌డిన అధికార యంత్రాంగం, టీడీపీ నేత‌లు కూడా ఆ త‌ర్వాత బాబు తీరు గ‌మనించి ఇదంతా మామూలే అన్న‌ట్టుగా మారిపోయారు. స‌రిగ్గా ప‌ది రోజుల క్రితం న‌ర్సీప‌ట్నాన్ని ఆనుకుని ఉన్న పాడేరు నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు నిర్వ‌హించిన స‌భ‌లో కూడా అదే సీన్ ద‌ర్శ‌న‌మిచ్చింది. అయితే అదే స‌మ‌యంలో జ‌గ‌న్ స‌భ‌ల‌కు వ‌స్తున్న జ‌నంలో నిల‌బ‌డే అయిన‌ప్ప‌టికీ ఎంత‌సేప‌యినా వేచి చూడ‌డ‌మే త‌ప్ప మ‌ధ్య‌లో క‌ద‌ల‌క‌పోవ‌డం జీర్ణం చేసుకోలేని విష‌యంగా మారింది.

చంద్ర‌బాబు స‌భ‌ల్లో వేదిక ముందు కుర్చీలు వేసి, పైన టెంటుల‌తో భారీ హంగామా చేసినా జ‌నం నిల‌బ‌డ‌ని స‌మ‌యంలో, జ‌నానికి ఎటువంటి కుర్చీలు గానీ, టెంట్లు గానీ లేకుండా ఎండ‌లో సైతం అదే ఆద‌ర‌ణ చూపించ‌డం, న‌ర్సీప‌ట్నంలో అయితే వ‌ర్షాన్ని సైతం జ‌నం ఖాత‌రు చేయ‌క‌పోవ‌డం విశేషంగా మారింది. ప‌రిశీల‌కు సైతం మారుతున్న రాజ‌కీయాల‌కు ఇదో తార్కాణంగా క‌నిపిస్తోంది. గొడుగులేసుకుని కొంద‌రు, అది కూడా లేకుండా అనేక మంది వ‌ర్షంలో త‌డుస్తూ జ‌గ‌న్ ఉప‌న్యాసం విన్న తీరు విస్మ‌యానికి గురిచేస్తోంది. అందులోనూ న‌ర్సీప‌ట్నం స్వ‌యంగా ఏపీ మంత్రి నియోజ‌క‌వ‌ర్గం. అయ్య‌న్న‌పాత్రుడికి పెట్ట‌ని కోట‌లాంటి చోట ఇప్పుడు ప్ర‌తిప‌క్ష నేత‌కు ల‌భించిన ఆద‌ర‌ణ‌, జ‌నంలో వ‌చ్చిన స్పంద‌న అసాధార‌ణంగా భావిస్తున్నారు.

ప్ర‌భుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్య‌తిరేక‌త ఉన్న స‌మ‌యంలోనే ఇలాంటి ప‌రిస్థితి ఉంటుంద‌ని అంతా భావిస్తున్నారు. మార్పు కోరుతున్న జ‌నాలు త‌మ‌కు ప్ర‌త్యామ్నాయంగా క‌నిపిస్తున్న నాయ‌కుడిని ఏ రీతిలో ఆద‌రిస్తార‌న‌డానికి జ‌గ‌న్ స‌భ‌లు ఉదాహ‌ర‌ణ‌కు అంచ‌నా వేస్తున్నారు. వైసీపీ బ‌ల‌హీనంగా ఉంద‌న్న అంచ‌నాలేస్తున్నప్ప‌టికీ విశాఖ జిల్లాలో తొలిస‌భ విజ‌య‌వంతం కావ‌డంతో ఆ జిల్లాలో విప‌క్ష శ్రేణుల‌కు ఈ ప‌రిణామం మ‌రింత ఊపునిచ్చేదిగా ఉంద‌ని చెబుతున్నారు.


Related News

చంద్ర‌బాబుకి షాకిచ్చిన అభ్య‌ర్థులు

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబుకి అటు అధికార యంత్రాంగం నుంచి ఇటు పార్టీ శ్రేణుల నుంచి కూడా ఎదురుదెబ్బ‌లుRead More

టీడీపీ బాట‌లో వైసీపీ!

Spread the loveఏపీలో అధికారం త‌మ‌దేన‌నే ధీమాతో ఉన్న వైసీపీ కూడా తెలుగుదేశం బాటలో సాగుతోంది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రిగినRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *