స‌ర్వే: చంద్ర‌బాబుని వెన‌క్కి నెట్టిన జ‌గ‌న్

babu jagan
Spread the love

ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు మ‌రో ముంద‌డుగు వేశారు. సీఎం చంద్ర‌బాబుని వెన‌క్కి నెట్టారు. సీఎం క‌న్నా ఓ అడుగు ముందు నిలిచారు. శ‌క్తిమంతుల జాబితాలో చంద్రబాబుని వెన‌క్కి నెట్టారు. తెలుగు రాష్ట్రాల‌లోనే టాప్ ప్లేస్ లో నిలిచారు. తాజాగా జాతీయ దిన‌ప‌త్రిక ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ వెలువ‌రించిన జాబితాలో తెలుగు రాష్ట్రాల నెంబ‌ర్ వ‌న్ గా జ‌గ‌న్ నిలిచారు. ఆయ‌న కి ఓవ‌రాల్ గా టాప్ 100మంది ఇండియ‌న్స్ లో 35వ స్థానం ద‌క్కింది.

ఆ త‌ర్వాత స్థానంలో చంద్ర‌బాబు నిలిచారు. ఆయ‌న‌కు 36వ స్థానం ద‌క్కింది. కాగా కేసీఆర్ కి 52వ స్థానం మాత్ర‌మే ద‌క్క‌డం విశేషం. ఇక జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ని ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ క‌థ‌నం ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. పాల‌క టీడీపీకి పెద్ద స‌వాల్ గా మారింద‌ని పేర్కొన్నారు. అందుకు తోడుగా చంద్రబాబు సామాజిక‌వ‌ర్గం అధిప‌త్యానికి వ్య‌తిరేకంగా వివిధ త‌ర‌గతుల‌ను స‌మీక‌రిస్తున్నార‌ని పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబుకి ఏపీలో సొంత ఇల్లూ కూడా లేద‌ని పేర్కొన‌డం విశేషం. ఆయ‌న ఉండ‌వ‌ల్లిలోని ఓ అద్దె నివాసంలో ఉంటున్నారంటూ ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ పేర్కొంది. దాంతో ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ అవుతోంది.

ఇక దేశ‌వ్యాప్తంగా మోడీ మొద‌టి స్థానంలో కొన‌సాగుతున్నారు. ఆత‌ర్వాత అమిత్ షాని శ‌క్తివంతుడైన నాయ‌కుడిగా ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ ప్ర‌క‌టించింది. సోనియా టాప్ 5, మ‌మ‌తాబెన‌ర్జీ 6లో ఉండ‌గా, ముఖేష్ అంబానీకి 10వ స్థానం ద‌క్కింది. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి మాత్రం 11వ స్థానం మాత్ర‌మే ద‌క్క‌డం విశేషం. తెలుగు రాష్ట్రాల‌లో మాత్రం ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబు క‌న్నా జ‌గ‌న్ ముందు నిల‌వ‌డం మాత్రం విశేష‌మే.


Related News

cbn deeksha

బాబుని మోడీ లైట్ తీసుకుంటున్నారా…?

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న పుట్టిన రోజు నాడు కూడా రిలేదీక్ష సాగిస్తున్నారు. భారీ ఏర్పాట్ల మ‌ధ్యRead More

YS-Jagan-Mohan-Reddy_0

రాజీనామాకి రెడీ అయిన జ‌గ‌న్!

Spread the loveఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న ప‌ద‌వికి రాజీనామా యోచ‌న‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌జాసంకల్ప‌యాత్ర‌లోRead More

 • గేరు మార్చిన ముద్ర‌గ‌డ
 • జగన్ ముందున్న అతి పెద్ద సవాల్ అదే..
 • హోరెత్తుతున్న హోదా
 • ఫ‌లించిన చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు
 • వైసీపీ పోరు కొత్తదారిలో…
 • స‌ర్వే: చంద్ర‌బాబుని వెన‌క్కి నెట్టిన జ‌గ‌న్
 • ఐదుగురు ఎంపీలే రాజీనామాలు!
 • ఇరుక్కున్న వైసీపీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *