Main Menu

జగన్ ముందున్న అతి పెద్ద సవాల్ అదే..

Spread the love

ఏపీ రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. రెండు నెలల వ్యవధిలోనే వారు వీరయ్యారు. బీజేపీ, టీడీపీ బంధం బ్రేకప్ తీసుకోగా, వైసీపీ, బీజేపీ మధ్య స్నేహం చిగురుస్తుందనే సందేహాలు పెరుగుతున్నాయి. టీడీపీ క్యాంప్ సాగిస్తున్న ప్రచారంతో వైసీపీ సతమతం అవుతోంది. బీజేపీకి దగ్గరవుతున్నారన్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వైసీపీ నేతలు దాదాపుగా విఫలం అయ్యారు. ముందే అవిశ్వాసం పెట్టాం, రాజీనామాలు చేశాం..ఆమరణ దీక్షలు చేస్తున్నాం అని చెబుతున్నప్పటికీ సామాన్యుడి సందేహాలు మాత్రం తీరడం లేదు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పూర్తిగా డ్యామేజ్ అయినట్టే భావించాలి. ఆపార్టీకి కనీసస్థాయిలో కూడా ఆదరణ దక్కుతుందా లేదా అన్నది అనుమానమే. ప్రజా వ్యతిరేకత ఆ స్థాయిలో ఉంది. గడిచిన ఎన్నికలకుముందు నిర్ధిష్టమైన ఓటింగ్ బలం ఉన్న కాంగ్రెస్ లాంటి పార్టీయే కుదేలుకాగా, అసలు పెద్దగా ప్రాధాన్యతలేని బీజేపీ ఏ స్థాయిలో కూరుకుపోతుందే ఊహించడం పెద్ద కష్టం కాబోదు. అలాంటి బీజేపీ మీద వ్యతిరేకత తీవ్రంగా ఉన్న దశలో మోడీతో స్నేహంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం వైసీపీకి పెద్ద అవరోధంగా మారింది. ఒకరకంగా చెప్పాలంటే గడిచిన ఎన్నికలకు ముందు జగన్ అవినీతి వ్యవహారం ఏ స్థాయిలో ప్రభావం చూపించిందో దానికి మించి ప్రస్తుతం బీజేపీతో స్నేహం విషయం ప్రభావితం చేస్తుందనే వారు కూడా ఉన్నారు. వాస్తవానికి జగన్ నేరుగా బీజేపీతో స్నేహానికి సిద్ధపడితే అప్పుడు సంగతి వేరు. కానీ బీజేపీతో దూరంగా ఉంటున్నప్పటికీ బీజేపీ మిత్రుడిగా ముద్ర ఎదుర్కోవాల్సి వస్తే అప్పుడు కూడా వేరు. ఆ రెండూ కాకుండా కేవలం బీజేపీతో బహిరంగంగా వ్యతిరేకంగా ఉంటూ, అంతర్గతంగా స్నేహం సాగిస్తున్నారనే ప్రచారానికి తగ్గట్టుగా సాగితే దాని ప్రభావం కూడా వేరు.

ఈ నేపథ్యంలో బీజేపీ, ఆపార్టీ నేతలతో వైసీపీ నేతల వ్యవహారం కొంత నష్టాన్ని తీసుకొస్తోందనడంలో సందేహం లేదని కొందరు పరిశీలకుల వాదన. చివరకు ఉండవల్లి వంటి వారు కూడా బీజేపీ నేతలతో వైసీపీ జాగ్రత్తలు పాటించకపోతే మునిగిపోతారనే అభిప్రాయంతో కనిపిస్తున్నారు. అలాంటి వాతావరణం తీసుకురావడంలో ఇప్పటికే ఓ వర్గం మీడియా విజయవంతం అయ్యింది. తిప్పికొట్టడానికి తగ్గట్టుగా వైసీపీ సన్నద్ధం కాలేకపోయింది. ఇది ఆపార్టీకి పెద్ద సమస్యగా మారింది. చంద్రబాబు మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ వినియోగించుకోవడం ఎలా అనే సందిగ్ధం తీసుకొస్తోంది. అందుకే ఇప్పుడు వైసీపీకి ఇదో పెద్ద సవాల్ గా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దానిని ఎదుర్కోలేకపోతే ఆపార్టీకి పెను ముప్ప పొంచి ఉంటుందనే వాదన ఉంది. ప్రశాంత్ కిషోర్ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారని, విజయసాయి రెడ్డి నిత్యం పీఎంవో లో ఉంటున్నారని, జగన్ ఒక్కసారి కూడా మోడీని పల్లెత్తు మాట అనలేకపోతున్నారని ..ఇలాంటి అనేక ప్రచారాలు సామాన్యుల్లో సాగుతున్నాయి. ఈ విషయంలో జగన్ ఎలా వ్యవహరిస్తారన్న దానిని బట్టి ఫలితాలు ఉంటాయని భావించవచ్చు. అందుకే ఈ ప్రచారాన్ని ఎదుర్కోవడమే జగన్ పెద్ద సవాల్ గా మారుతోంది.


Related News

కేసీఆర్ సీఎం అయితే చంద్ర‌బాబుకి క‌ష్టాలే!

Spread the loveత్వ‌ర‌లోనే టీడీపీ కండువా క‌ప్పుకోబోతున్నట్టు ప్ర‌చారంలో ఉన్న మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.Read More

ల‌గ‌డ‌పాటి ఎగ్జిట్ పోల్: కూట‌మి ఆధిక్యం

Spread the loveల‌గ‌డ‌పాటి ఎగ్జిట్ పోల్ వెలువ‌డింది. అయితే ఈసారి ఆయ‌న ఆశ్చ‌ర్యంగా భారీ తేడా చూపించారు. ముఖ్యంగా అధికార‌,Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *