జ‌గ‌న్ కేసుల్లో ఊర‌ట‌

Hyderabad_High_Court
Spread the love

జ‌గ‌న్ కేసుల్లో కీల‌క మ‌లుపు క‌నిపించింది. తాజాగా లేపాక్షి హ‌బ్ భూముల‌కు సంబంధించి హైకోర్ట్ తీసుకున్న నిర్ణ‌యం రాజ‌కీయంగానూ చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. జ‌గ‌న్ కేసుల వ్య‌వ‌హారానికి ఇదో నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోంది. తాజాగా న‌మోద‌యిన ఛార్జ్ షీట్లో అభియోగాల‌ను కోర్ట్ కొట్టివేయ‌డంతో కేసు వీగిపోయిన‌ట్ట‌య్యింది. జ‌గ‌న్ కేసుల‌కు సంబంధించిన మొత్తం 11 ఛార్జిషీట్ల‌కు గానూ 9 ఛార్జిషీట్లు నీరుగారిపోయిన‌ట్టే చెప్ప‌వ‌చ్చు. ఇక మిగిలిన 2 ఛార్జిషీట్లు ఏమ‌వుతాయోన‌నే ఆస‌క్తి క‌నిపిస్తోంది..

ఈ కేసులో రిటైర్డు ఐఎఎస్‌ అధికారి శాంబాబ్‌పై సిబిఐ నమోదు చేసిన ఛార్జిషీటును హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు వెలువరిం చింది. శాంబాబ్‌ సర్వీసులో ఉండగా విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి నిరాకరించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆయ‌న‌పై సిబిఐ పెట్టిన ఛార్జిషీటు చెల్లదని న్యాయమూర్తి ఎం.సీతారామమూర్తి తీర్పు చెప్పా రు. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌కు భూ కేటాయిం పుల కేసులో సిబిఐ పెట్టిన కేసును కొట్టేయాలంటూ శాంబాబ్‌ వేసిన వ్యాజ్యంపై ఈ తీర్పు ఇచ్చారు.

అప్ప‌ట్లో వైఎస్ హ‌యంలో ప‌లు భూ కేటాయింపుల్లో అక్ర‌మాలు జ‌రిగాయంటూ ప‌లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వాటిని ఉప‌యోగించుకుని జ‌గ‌న్ ప్ర‌యోజ‌నాలు ద‌క్కించుకున్నార‌న్న‌ది సీబీఐ ఆరోప‌ణ‌. దాని ఆదారంగా అప్ప‌ట్లో కాంగ్రెస్, తాజాగా టీడీపీ నిత్యం జ‌గ‌న్ మీద ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నాయి. అయితే ఇప్పుడు అలాంటి భూ కేటాయింపుల్లో ఒక కేసు విష‌యంలో ఎటువంటి త‌ప్పిదాలు లేవ‌న్న‌ట్టుగా వాస్త‌వం వెలుగు చూడ‌డంతో మిగిలిన కేసులు కూడా ఇదే మాదిరిగా వీగిపోతాయ‌నే అభిప్రాయం చాలామందిలో క‌నిపిస్తోంది. అధికారులు త‌ప్పిదాలు లేన‌ప్పుడు వాటి ఆధారంగా జ‌గ‌న్ ప్ర‌యోజ‌నం ద‌క్కించుకునే అవ‌కాశం లేనందున, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత మీద కేసుల విష‌యంలోనూ చివ‌ర‌కు ఊర‌ట ఖాయ‌మ‌న‌నే వాళ్లు పెరుగుతున్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *