Main Menu

వైసీపీ హోరు గాలి, టైమ్స్ నౌ తాజా స‌ర్వే

Spread the love

జాతీయ మీడియా సంస్థ‌ల స‌ర్వేల‌లో వైసీపీ హోరు గాలి వీస్తోంది. ఆపార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఖాయంగా క‌నిపిస్తోంది. అన్ని స‌ర్వేల‌లోనూ జ‌గ‌న్ కి ఏపీ ప్ర‌జ‌ల మ‌ద్ధ‌తు ఉన్న‌ట్టు తేలుతోంది. ఇక తాజాగా మార్చి నెల‌లో చేసిన స‌ర్వే వివ‌రాల‌ను టైమ్స్ నౌ వెల్ల‌డించింది. ఈ స‌ర్వే ప్ర‌కారం గ‌త నెల‌తో పోలిస్తే జ‌గ‌న్ కి అనుకూల‌త పెర‌గ‌డం విశేషం.

ఏపీ రాజ‌కీయాల్లో టీ 20 త‌ర‌హా ప‌రిణామాలు సాగుతున్నాయి. జ‌న‌వ‌రిలో చంద్ర‌బాబు ప‌థ‌కాలు కొంత సానుకూల‌త తీసుకురాగా, గ‌డిచిన నెల రోజులుగా వ‌రుస ఫిరాయింపులు, టికెట్ల కేటాయింపులో జ‌గ‌న్ వ్యూహాలు అన్నీ క‌లిసి వైసీపీ ఇమేజ్ భారీగా పెంచాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే ఉన్న ఈ స‌ర్వే వివ‌రాలు చూడండి.

ఏకంగా 22 ఎంపీ సీట్లు జ‌గ‌న్ కి వ‌స్తాయ‌ని ఈ స‌ర్వే వెల్ల‌డించ‌డం విశేషంగా మారింది. దీని ఆధారంగా క‌నీసం 120 ఎమ్మెల్యే సీట్ల‌కు ఢోకా లేకుండా వైసీపీ గెల‌వ‌గ‌ల‌ద‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి. తెలంగాణాలో కేసీఆర్ హవాకి అడ్డులేద‌ని ఈస‌ర్వే చెబుతోంది. కాంగ్రెస్ కేవ‌లం ఒకే ఒక్క స్థానంతో స‌రిపెట్టుకోక త‌ప్ప‌ద‌ని అంచ‌నాలేస్తోంది. జాతీయ స్థాయిలో మాత్రం హోరాహోరీ పోరు సాగే అవ‌కాశాలున్న‌ట్టు క‌నిపిస్తోంది.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *