ఇరుక్కున్న వైసీపీ

modi vijayasaireddy
Spread the love

రాజకీయాల్లో జాగ్రత్తగా వ్యవహరించకపోతే సమస్యలు తప్పవు. అడుగడుగునా ప్రత్యర్థులు అవకాశాల కోసం చూస్తుంటారు. అందుకే జాగ్రత్త చాలా అవసరం. ఈ విషయంలో వైసీపీ నేతల తీరు భిన్నంగా ఉంటుంది. అనేక మార్లు అతివిశ్వాసంతో సమస్యలు కొనితెచ్చుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య. నంద్యాల ఎన్నికల ఫలితాలు దానికి సాక్ష్యంగా చెప్పవచ్చు. ఇక తాజాగా ప్రత్యేక హోదా ఉద్యమం మూలంగా వైఎస్ జగన్ ఇమేజ్ పెరిగిందనడంలో సందేహం లేదు. చంద్రబాబు పదే పదే మాట మార్చిన తీరు కారణంగా అధికార పార్టీ ఆత్మరక్షణ ధోరణిలో పడింది. అందుకే అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని నిర్ణయించుకుంది.

ఇక తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో మోడీ కాళ్లకు మొక్కిన వ్యవహారం వైసీపీని ఇరుకున పెట్టింది. వాస్తవానికి విజయసాయికి ముందు సుజనా రెడ్డి, ఇతర టీడీపీ నేతలు కూడా మోడీని కలిశారు. అత్యంత వినయం ప్రదర్శించారు. కానీ విజయసాయిరెడ్డి మరో అడుగు ముందుకేసి ముందుకు వంగి దండం పెట్టే ప్రయత్నం చేయడంతో మోడీ ముందు వైసీపీ మోకరిల్లిందనే ప్రచారం సాగింది. దాంతో వైసీపీ డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది. ప్రతిగా విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఏకంగా సీఎం రమేష్ ని నాటుసారా అమ్ముకుని పైకి వచ్చారని, నాలుగు రోజుల్లో అతని బండారం బయటపెడతానని హెచ్చరించారు. అంతటితో సరిపెట్టకుండా తనను విజయమాల్యాతో పోల్చడంపై ఆయన భగ్గుమన్నారు. చంద్రబాబుని ఏకంగా ఛార్లెస్ శోభరాజ్ తో పోల్చి తీవ్ర ఆరోపణలు చేశారు.

మరోవైపు టీడీపీ నేతలు మాత్రం విజయసాయిరెడ్డి మీద ప్రచారం తీవ్రం చేశారు. మోడీ ముందు తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దాంతో టీడీపీ ప్రచారంతో ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తుండడంతో వైసీపీ సమాధానం చెప్పుకోవాల్సిన స్థితిలో పడింది. బీజేపీతో వైసీపీ మిలాఖ‌త్ అయ్యిందంటూ ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు చేస్తున్న టీడీపీకి పెద్ద ఆయుధం అందించిన‌ట్ట‌య్యింది.


Related News

cbn deeksha

బాబుని మోడీ లైట్ తీసుకుంటున్నారా…?

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న పుట్టిన రోజు నాడు కూడా రిలేదీక్ష సాగిస్తున్నారు. భారీ ఏర్పాట్ల మ‌ధ్యRead More

YS-Jagan-Mohan-Reddy_0

రాజీనామాకి రెడీ అయిన జ‌గ‌న్!

Spread the loveఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న ప‌ద‌వికి రాజీనామా యోచ‌న‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌జాసంకల్ప‌యాత్ర‌లోRead More

 • గేరు మార్చిన ముద్ర‌గ‌డ
 • జగన్ ముందున్న అతి పెద్ద సవాల్ అదే..
 • హోరెత్తుతున్న హోదా
 • ఫ‌లించిన చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు
 • వైసీపీ పోరు కొత్తదారిలో…
 • స‌ర్వే: చంద్ర‌బాబుని వెన‌క్కి నెట్టిన జ‌గ‌న్
 • ఐదుగురు ఎంపీలే రాజీనామాలు!
 • ఇరుక్కున్న వైసీపీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *