Main Menu

ఐదుగురు ఎంపీలే రాజీనామాలు!

Spread the love

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోరుతూ అవిశ్వాసం ప్ర‌క‌టించినప్ప‌టికీ పార్ల‌మెంట్ లో చ‌ర్చ సాగుతుందా లేదా అన్న సందిగ్ధం ఏర్ప‌డింది. ఓ ద‌శ‌లో చ‌ర్చ‌కు సిద్ధంగా ఉన్నామ‌ని సంకేతాలు ఇచ్చిన బీజేపీ పెద్ద‌లు మ‌ళ్లీ మ‌న‌సు మార్చుకున్నారు. అవిశ్వాసం అడ్డుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ఏఐడీఎంకేని ప్రోత్స‌హిస్తున్నార‌నే ప్ర‌చారం ఉంది. టీఆర్ఎస్ వెన‌క్కి త‌గ్గినా పార్ల‌మెంట్ లో అన్నా డీఎంకే ఎంపీలు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న తీరు పార్ల‌మెంట్ కార్య‌క‌లాపాల‌కు ఆటంకంగా మారింది. దాంతో స‌భ నిర‌వ‌ధిగా వాయిదా ప‌డుతుంద‌నే చ‌ర్చ మొద‌ల‌య్యింది. ఈ నేప‌థ్యంలో ఏపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధ‌ప‌డుతున్నారు. వైసీపీ తీసుకున్న నిర్ణ‌యంలో భాగంగా రాజీనామాలు చేయాల‌ని భావించిన‌ప్ప‌టికీ దానికి కేవ‌లం ఐదుగురు ఎంపీలు మాత్ర‌మే సిద్ధ‌ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది.

వైసీపీ ఏపీలోని 8 ఎంపీ సీట్ల‌ను గెలుచుకుంది. కానీ అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత‌, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తొలి ఏడాదిలోనే టీడీపీలో చేరిపోయారు. కొద్దినెల‌ల క్రితం క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా ఫిరాయించేశారు. తెలంగాణాలో గెలిచిన ఖ‌మ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. దాంతో వైసీపీకి నిక‌రంగా మిగిలింది ఐదుగురు ఎంపీలు మాత్ర‌మే. వారిలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి, తిరుప‌తి ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, ఒంగోలు ఎంపీ ఎస్వీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఈ ఐదుగురు స్పీక‌ర్ ఫార్మెట్లో రాజీనామాల‌కు సిద్ధ‌ప‌డ్డారు. స‌భ వాయిదాప‌డిన వెంట‌నే రాజీనామాలు స‌మ‌ర్పించ‌డానికి త‌గ్గ‌ట్టుగా సంత‌కాలు చేసి సిద్ధం చేశారు.

అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత మాత్రం టీడీపీ, వైసీపీల‌ను విమ‌ర్శిస్తున్నారు. ఏకంగా కొత్త‌పార్టీ అంటూ ఓ ప్ర‌క‌ట‌న చేసి చాలామందిని ఆశ్చ‌ర్చ‌ప‌రిచారు. ఇక టీడీపీతో క‌లిసి సాగుతున్న ఎస్పీవై రెడ్డి, బుట్టారేణుక మాత్రం రాజీనామాల‌కు దూరంగా ఉంటార‌ని స‌మాచారం. టీడీపీ కూడా రాజీనామాల‌కు సిద్ధ‌ప‌డితే అప్పుడు ఈ ఇద్ద‌రు ఎంపీలు కూడా రాజీనామాలు చేసే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.అ లాంటి ప‌రిస్థితి వ‌స్తుందా అన్న‌ది వేచి చూడాల్సిందే. కానీ వైసీపీ అధిష్టానం నిర్ణ‌యంతో ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేస్తుండ‌డంతో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయా రాదా అనే చ‌ర్చ కూడా మొద‌ల‌య్యింది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బ‌ట్టి ప‌రిస్థితులుంటాయ‌ని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు.


Related News

వైసీపీ ఖాతాలో మ‌రో ఎమ్మెల్యే

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య‌లో మ‌రో నెంబ‌ర్ తోడ‌య్యింది. వాస్తవానికి అధికారికంగా 67మందిని గెలిపించుకున్న ఈRead More

కేసీఆర్ సీఎం అయితే చంద్ర‌బాబుకి క‌ష్టాలే!

Spread the loveత్వ‌ర‌లోనే టీడీపీ కండువా క‌ప్పుకోబోతున్నట్టు ప్ర‌చారంలో ఉన్న మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *