వైసీపీ పోరు కొత్తదారిలో…

1736_ysrcp
Spread the love

ఏపీలో ప్రత్యేక హోదా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. పార్టీలన్నీ అదే నినాదంతో సాగుతున్నాయి. కేవలం బీజేపీ మినహా అందరూ హోదా కావాలనే డిమాండ్ చేస్తున్నారు. కమలదళాన్ని పూర్తిగా ఒంటరి చేసేశారు. ఈ నేపథ్యంలోనే హోదా పోరులో ఎవరికి వారు పై చేయి కోసం ప్రయత్నిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే వైసీపీ మరో అడుగు ముందుకేస్తోంది. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి ఉద్యమిస్తున్న పార్టీగా మరో మెట్టు ఎక్కిస్తోంది. ఇప్పటికే అవిశ్వాసం అంశాన్ని తెరమీదకు తెచ్చి చివరకు అధికార పార్టీ కూడా తన దారికి వచ్చేలా చేయడంలో వైసీపీ విజయవంతం అయ్యిందనే చెప్పవచ్చు.

ఇప్పుడు మరోసారి హోదా ఉద్యమాన్ని హస్తిన వీధుల్లో సాగించడానికి సన్నద్ధమవుతోంది. దానికి తగ్గట్టుగా రాజీనామా అస్త్రాలు సంధించాలని నిర్ణయం తీసుకున్న వైసీపీ తాజాగా ఏకంగా ఆమరణదీక్షలకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా ప్రజాసంకల్పయాత్ర బహిరంగసభలో జగన్ ఈ ప్రకటన చేశారు. పార్లమెంట్ వాయిదా పడగానే వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తారని, ఆవెంటనే ఆమరణదీక్షకు దిగుతారని ప్రకటించారు. ఏపీ భవన్ లో సాగే దీక్షలో వైసీపీ ఎంపీలంతా పాల్గొంటారని తెలిపారు. టీడీపీ కూడా కలిసివస్తే కేంద్రం మీద ఒత్తిడి పెరుగుతుందని వ్యాఖ్యానించారు.

అంతటితో సరిపెట్టకుండా ఎంపీల దీక్షలకు మద్ధతుగా ఊరూవాడా కదలాలని పిలుపునిచ్చారు. విద్యార్థి, యువజనులు అన్ని చోట్లా దీక్షలు చేయాలని కోరారు. తద్వారా కేంద్రం దిగివస్తుందని తెలిపారు. దాంతో ప్రత్యేక హోదా ఏపీ వాసులు సాగిస్తున్న పోరాటం మరో దశకు చేరుకున్నట్టేనని పలువురు భావిస్తున్నారు.


Related News

cbn deeksha

బాబుని మోడీ లైట్ తీసుకుంటున్నారా…?

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న పుట్టిన రోజు నాడు కూడా రిలేదీక్ష సాగిస్తున్నారు. భారీ ఏర్పాట్ల మ‌ధ్యRead More

YS-Jagan-Mohan-Reddy_0

రాజీనామాకి రెడీ అయిన జ‌గ‌న్!

Spread the love22Sharesఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న ప‌ద‌వికి రాజీనామా యోచ‌న‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌జాసంకల్ప‌యాత్ర‌లోRead More

 • గేరు మార్చిన ముద్ర‌గ‌డ
 • జగన్ ముందున్న అతి పెద్ద సవాల్ అదే..
 • హోరెత్తుతున్న హోదా
 • ఫ‌లించిన చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు
 • వైసీపీ పోరు కొత్తదారిలో…
 • స‌ర్వే: చంద్ర‌బాబుని వెన‌క్కి నెట్టిన జ‌గ‌న్
 • ఐదుగురు ఎంపీలే రాజీనామాలు!
 • ఇరుక్కున్న వైసీపీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *