వైసీపీలో కీలక వైశ్య నేత

ysrcp
Spread the love

వైసీపీకి కొత్త వర్గాల్లో ఆదరణ పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా నంద్యాల ఎన్నికల నేపథ్యంలో ఆర్యవైశ్యుల పాత్ర ప్రధానంగా మారింది. ఇప్పటికే వారి కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేస్తానని వైెఎస్ జగన్ నంద్యాల సభ సాక్షిగా ప్రకటించారు. దానిని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ వంటి వైశ్య నేతలు ఆహ్వానించారు కూడా. మరోవైపు ఇప్పటికే విజయవాడలో వెల్లంపల్లి శ్రీనివాస్, కాకినాడలో ముత్తా కుటుంబం వంటి ఆకులానికి చెందిన కీలక నేతలు జగన్ శిబిరంలో చేరారు. తాజాగా వారి సరసన మరో వైశ్య నేత చేరుతున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన మాజీ ఏపీఐఐసీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు.
sighakollapu sivaram

శివరామసుబ్రహ్మణ్యం సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ లో ఉన్న నాయకుడు. రోశయ్య శిష్యుడిగా రాజకీయాల్లో ఎదిగిన ఒకనాటి విద్యార్థి నేత. రాజమహేంద్రవరంలో జక్కంపూడి సహచరుడు. రోశయ్య సీఎంగా ఉన్న కాలంలో ఆయనకు ఏపీఐఐసీ పదవి దక్కింది. ఆతర్వాత జై సమైక్యాంద్ర తరుపున మొన్నటి ఎన్నికల్లో రాజమహేంద్రవరం సీటు నుంచి పోటీ చేశారు. ఇక ఇప్పుడు వైసీపీలో చేరడం ద్వారా రాజమహేంద్రవరం నగరంలో ప్రభావితం చేయగల వైశ్య వర్గాన్ని వైసీపీ వైపు తిప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.

నంద్యాలలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఇతర వైశ్య నేతలతో కలిసి శివరామసుబ్రహ్మణ్యం జగన్ చేతుల మీద కండువా కప్పుకోబోతున్నారు. దాంతో నంద్యాల ఎన్నికల్లో తన సామాజికవర్గం ఆదరణ వైసీపీకే ఉంటుందని చెప్పడానికి ప్రయత్నించబోతున్నారు. మొత్తంగా వైసీపీలో కొత్త సామాజికవర్గాల చేరిక రాజకీయాల్లో నూతన పరిణామంగానే భావించాలి.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *