విజయసాయికి అసలైన పరీక్ష

jagan-vijaya-645-06-1486361225-06-1499360204
Spread the love

వైసీపీ నాయకుడిగా పార్లమెంట్ లో మంచి మార్కులు కొట్టేశారు. పలువురి ప్రశంసలందుకున్నారు. ప్రశ్నలు వేయడంలోనూ, చర్చల్లోనూ, నిధుల వినియోగంలోనూ చాలామంది ఎంపీలకు ఆయన ఆదర్శంగా ఉన్నారు. దాంతో తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టినప్పటికీ తన చొరవతో చాలామందిని ఆకట్టుకున్నారు.కానీ ఇప్పుడు ఆయనకు పెద్ద పరీక్ష ఎదురయ్యింది. హస్తినలో సాటి ఎంపీల మనసులు గెలిచిన విజయసాయి రెడ్డి ఇప్పుడు ఏపీలో ప్రజల మనసు గెలవాల్సి ఉంటుంది. రచ్చ గెలిచిన ఆయన ఇంట గెలిస్తేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆయన తన పథకాలకు పదును పెడుతున్నారు. ఎత్తులను సిద్ధం చేస్తున్నారు. వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఏదో ఒకటి చేసి కాకినాడలో వైసీపీ గెలిచిందనిపించుకోవాలని ఆయన భావిస్తున్నారు. అధికార పార్టీని ఢీకొట్టడం అంత సులువు కాకపోయినప్పటికీ సాధించి తీరాలన్న పట్టుదలతో కనిపిస్తున్నారు. దాంతో విజయసాయి రెడ్డి వ్యూహాలకు ఇప్పుడు అసలైన పరీక్ష ఎదురయినట్టు అంతా భావిస్తున్నారు.

కాకినాడ చాలాకాలంగా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉంటోంది. 1987 ఎన్నికల తర్వాత జరిగిన మునిసిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలయ్యింది. అంటే ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ కాకినాడ స్థానిక సంస్థలతో పాగా వేయాలని టీడీపీ భావిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత, స్థానిక ఎమ్మెల్యే పనితీరుతో విసుగు చెందిన ఉన్న ప్రజలు, టీడీపీ, బీజేపీ మధ్య సఖ్యత లేకపోవడం, రెబల్స్ వంటి సమస్యలతో సతమతమవుతున్న టీడీపీని దెబ్బకొట్టాలని వైసీపీ పావులు కదుపుతోంది. దానికి విజయసాయి రెడ్డి ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వైసీపీ తరుపున కాకినాడ ఎన్నికల బాధ్యత చూస్తున్న ఆయన మొత్తం వ్యవహారాలను తన భుజస్కంధాలపై వేసుకున్నారు.

వాస్తవానికి విజయసాయిరెడ్డికి ప్రత్యక్ష ఎన్నికల అనుభవం లేదు. ఆయన గెలిచింది కూడా పరోక్ష పద్ధతిలోనే. గడిచిన ఎన్నికల్లో ఆయనది తెరవెనుక పాత్ర మాత్రమే. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత రాజకీయాల్లోకి నేరుగా వచ్చినా, అనుభవం పెద్దగా లేకపోయినా విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. అనేక అంశాల్లో పరిణతి ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడలో వైసీపీ వర్గపోరుతో సతమతం అవుతోంది. నియోజకవర్గ ఇన్చార్జ్ లుగా ఉన్న ముత్తా శశిధర్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య సఖ్యత కనిపించడం లేదు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కన్నబాబుకి సామర్థ్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. చివరకు పార్టీకి జిల్లాలో ఒక కార్యాలయం కూడా లేకపోవడంతో ఓ హోటల్ నుంచి వ్యవహారాలు నడుపుకోవాల్సిన దుస్థితి కాకినాడలో ఉంది. ఇలాంటి సమయంలో రంగంలోకి వచ్చిన విజయసాయి తనకు తోడుగా బొత్సా వంటి నేతల సహాయంతో పలువురు సీనియర్లను తమవైపు తిప్పుకున్నారు. నగరంలో వైసీపీలో పలువురు చేరుతుండడంతో ఆపార్టీ బలపడుతోందనే అభిప్రాయం ప్రజల్లో కలిగించగలిగారు.

కానీ అసలు సమస్య ఇప్పుడు మొదలయ్యింది. ప్రస్తుతం 48 సీట్లకు జరుగుతున్న ఎన్నికల్లో పలువురు రెబల్స్ తలనొప్పిగా మారారు. వారిని బుజ్జగించడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. దాంతో ఓట్ల చీలక మళ్లీ టీడీపీకి అవకాశం ఇస్తుందా అన్న అనుమానం ఉంది. దాంతో విజయసాయిరెడ్డి ద్రుష్టి అటు మళ్లింది. రెబల్స్ ను బుజ్జగించడం, అభ్యర్థులను సమన్వయం చేయడం. మూడు వర్గాలను ఏకతాటి మీదకు తీసుకురావడమే లక్ష్యంగా సాగుతున్నారు. వాటిలో ఫలప్రదమైతే సానుకూల ఫలితాలు ఖాయమని అంచనా వేస్తున్నారు. మరి విజయసాయి ప్రయత్నాలు ఏమేరకు ఫలితాలు సాధిస్తారన్నది చూడాలి.జగన్ నంద్యాల మీద కేంద్రీకరించడంతో కాకినాడ పూర్తిగా విజయసాయిరెడ్డి కనుసన్నల్లో సాగుతోంది. ఈనెల 22 నుంచి జగన్ కూడా ప్రచారానికి వచ్చినప్పటికీ విజయసాయిరెడ్డి వ్యూహాల ప్రకారమే నడుస్తుంది. కాబట్టి కాకినాడలో విజయసాయిరెడ్డి స్కెచ్ ఫలిస్తే వర్తమాన రాజకీయాల్లో ఆయనకు మరింత గుర్తింపు వస్తుంది. వైసీపీకి ఇంకా కీలకనేతగా మారతారు.


Related News

jagancbn

బాబు, జగన్ కూడా అదే నియోజకవర్గంలో…

Spread the loveఏపీ ప్రతిపక్ష నేత ప్రజాసంకల్ప యాత్రలో ముందుకు సాగుతున్నారు. గడిచిన 60 రోజులుగా సాగుతున్న యాత్ర ఇప్పటికేRead More

chandrababu

పరువు కాపాడుకోవడానికి బాబు…

Spread the loveఅడుసు తొక్కనేల ..కాళ్లు కడగనేల అన్నట్టుగా మారింది చంద్రబాబు పరిస్థితి. మత్స్యకారులకిచ్చిన ఎన్నికల హామీని అమలుచేయమన్నందుకు ఆయనRead More

 • పవన్ మాట విని పరువు తీసిన చంద్రబాబు
 • ఆ లేఖ ఫేక్
 • జనసేనానికి తలైవా పాఠం?
 • పోలవరంలో కొత్త తగాదా
 • రాజమౌళికి షాకిచ్చిన రాజధాని
 • రంగంలోకి జేసీ సన్స్
 • కొత్త జిల్లాలకు చంద్రబాబు వెనకడుగు..
 • శ్రీలంకకు ఊరట విజయం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *