పోలవరంలో కొత్త తగాదా

polavaram project_0_0_0_0
Spread the love

పోలవరం ప్రాజెక్ట్ కి మరో సమస్య ముందుకొచ్చింది. వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం చెబుతుంటే కాంట్రాక్ట్ సంస్థ కష్టాలు మాత్రం రెట్టింపవుతున్నాయి. తాజాగా ట్రాన్స్ ట్రాయ్ వ్యవహారం మరోసారి వివాదాస్పదం అవుతోంది. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నట్టు కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌పై కెనరా బ్యాంకు.. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించడంతోో వ్యవహారం కొత్త దిశగా మళ్లుతున్నట్టు కనిపిస్తోంది.. ఆ సంస్థ దివాలా తీసినట్లుగా ప్రకటించాలని, కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియను చేపట్టాలని కెనరా బ్యాంక్ కోరింది. దీంతో ట్రాన్‌స్ట్రాయ్‌ భవితవ్యంతోపాటు పోలవరం ప్రాజెక్టు భవిష్యత్‌ కూడా డోలాయమానంలో పడింది. ట్రాన్‌స్ట్రాయ్‌ తమకు రూ.725 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని.. ఈ నెల 22 నాటికి రూ.489 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. బ్యాంకు గ్యారంటీ కింద రూ.379 కోట్లే ఉంచిందని కెనరా బ్యాంకు పేర్కొంది.

కెనరా బ్యాంకు తరపున బ్యాంకు అధికారి పి కోటేశ్వరరావు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ట్రైబ్యునల్‌ త్వరలోనే ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియ ప్రారంభించనుంది. ఇందులోభాగంగా ట్రాన్‌స్ట్రాయ్‌ను దివాలా సంస్థగా ప్రకటిస్తే ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న కాంట్రాక్టు సంస్థకు మున్ముందు బ్యాంకుల నుంచి పరపతి పుట్టే అవకాశమే ఉండదు. అప్పుడు పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కాఫర్‌ డ్యాం, స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ వంటి సంక్లిష్టమైన, అతిముఖ్యమైన కాంక్రీట్‌ పనులు ముందుకు సాగవు. ఇదే జరిగితే 2019 నాటికి గ్రావిటీ ద్వారా నీరివ్వాలని, 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరదు.

దాంతో పోలవరం ఆశలు నీరుగారినట్టేనని భావించాలి. ఇప్పటికే కేంద్రం నెలరోజులు గడువు ఇచ్చినట్టు ప్రకటించింది. ఈలోగా కాంట్రాక్ట్ సంస్థ పనులు వేగవంతం చేయాలని ఆధేశించింది. కానీ ఈలోగా నేషనల్ లా ట్రిబ్యూనల్ వ్యవహారం ముందుకు రావడంతో ట్రాన్స్ ట్రాయ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.






Related News

jagancbn

బాబు, జగన్ కూడా అదే నియోజకవర్గంలో…

Spread the loveఏపీ ప్రతిపక్ష నేత ప్రజాసంకల్ప యాత్రలో ముందుకు సాగుతున్నారు. గడిచిన 60 రోజులుగా సాగుతున్న యాత్ర ఇప్పటికేRead More

chandrababu

పరువు కాపాడుకోవడానికి బాబు…

Spread the loveఅడుసు తొక్కనేల ..కాళ్లు కడగనేల అన్నట్టుగా మారింది చంద్రబాబు పరిస్థితి. మత్స్యకారులకిచ్చిన ఎన్నికల హామీని అమలుచేయమన్నందుకు ఆయనRead More

  • పవన్ మాట విని పరువు తీసిన చంద్రబాబు
  • ఆ లేఖ ఫేక్
  • జనసేనానికి తలైవా పాఠం?
  • పోలవరంలో కొత్త తగాదా
  • రాజమౌళికి షాకిచ్చిన రాజధాని
  • రంగంలోకి జేసీ సన్స్
  • కొత్త జిల్లాలకు చంద్రబాబు వెనకడుగు..
  • శ్రీలంకకు ఊరట విజయం
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *