Main Menu

వైసీపీ ఖాతాలో మ‌రో ఎమ్మెల్యే

Spread the love

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య‌లో మ‌రో నెంబ‌ర్ తోడ‌య్యింది. వాస్తవానికి అధికారికంగా 67మందిని గెలిపించుకున్న ఈ పార్టీ నుంచి 23 మంది ఫిరాయించారు. ఆత‌ర్వాత భూమా నాగిరెడ్డి మ‌ర‌ణించ‌డంతో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో నంధ్యాల సీటు టీడీపీ ఖాతాలో చేరిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ బలం పెర‌గడానికి కోర్ట్ తీర్పు కార‌ణంగా మారింది. అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా తిప్పేస్వామి కొనసాగుతారని సుప్రీం కోర్టు స్పష్టీకరించింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నికల చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి విధితమే. ఈ తీర్పుపై ఈరన్న సుప్రీం కోర్టుకు వెళ్లగా అక్కడ ఆయనకు చుక్కెదురైంది. ఈరన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. సుప్రీం కోర్టు తీర్పు పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.






Related News

వైసీపీ హోరు గాలి, టైమ్స్ నౌ తాజా స‌ర్వే

Spread the loveజాతీయ మీడియా సంస్థ‌ల స‌ర్వేల‌లో వైసీపీ హోరు గాలి వీస్తోంది. ఆపార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఖాయంగా క‌నిపిస్తోంది.Read More

వైసీపీ రెండో జాబితా ఎంపీ అభ్య‌ర్థులు

Spread the loveశ్రీకాకుళం- దువ్వాడ శ్రీనివాస్ విజ‌య‌న‌గ‌రం- బెల్లాని చంద్ర‌శేఖ‌ర్ విశాఖ‌ప‌ట్ట‌ణం-ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌ అన‌కాప‌ల్లి- డాక్ట‌ర్ స‌త్య‌వ‌తి కాకినాడ వంగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *