బడ్జెట్ పై బాబు రెండు కళ్ల సిద్ధాంతం

tdp mps
Spread the love

ఏపీ సీఎం రెండు కళ్ల సిద్ధాంతం గురించి చాలామందికి తెలుసు. కానీ ప్రస్తుతం ఏపీ బడ్జెట్ విషయంలో ఆయన తీరు చర్చనీయాంశంగా మారుతోంది. కేంద్రంలో ఆయన నేటికీ భాగస్వామిగా ఉన్నారు. టీడీపీ తరుపున ఇద్దరు మంత్రులు కూడా మోడీ క్యాబినెట్ లో ఉన్నారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ని ముందుగానే టీడీపీ మంత్రులు ఆమోదించారు. అంటే మోడీకి సంపూర్ణంగా మద్ధతు ప్రకటించారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ ఆశలను తుంచేయడంలో మోడీకి అండగా టీడీపీ మంత్రులు నిలిచారు.

అంతవరకూ బాగానే ఉంది కానీ బడ్జెట్ వచ్చిన తర్వాత మాత్రం ఏపీ ప్రజలు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దాంతో ఈ విషయం గ్రహించిన తెలుగుదేశం తొలుత బడ్జెట్ కి మద్ధతు ప్రకటించిన విషయం మరచిపోయి చిందులు వేస్తోంది. ఏపీకి తీరని అన్యాయం జరిగిందంటూ చంద్రబాబు సైతం అసహనం ప్రదర్శిస్తున్నారు. పత్రికల్లో లీకులిస్తున్నారు. కానీ అదే సమయంలో మద్ధతు ఉపసంహరణకు గానీ, కొందరు ఎంపీలు చెబుతున్నట్టు రాజీనామాల విషయంలో గానీ బాబు వెనకడుగు వేస్తున్నారు. ఓవైపపు ఆగ్రహం ప్రదర్శిస్తూనే మరోవైపు అనుచరగణంలో కొనసాగడానికి సిద్ధపడతున్నారు.

దానికి కొనసాిగింపుగానే అన్నట్టుగా తాజాగా పార్లమెంట్ ముందు టీడీపీ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. లోపల మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరీ బీజేపీ కి వంతపాడుతుంటే, బయట ఆ పార్టీ నేతలు మాత్రం ధర్నాలు చేయడం విస్మయకరంగా కనిపిస్తోంది. మిత్రపక్షంగా, ప్రభుత్వ భాగస్వామిగా ఉండి నిరసనలకు దిగడం నయా రాజకీయాలకు నిలువుటద్దంగా కనిపిస్తోంది. దాంతో బడ్జెట్ పై కూడా చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం ప్రదర్శిస్తున్నట్టు పలువురు భావిస్తున్నారు. ఓవైపు వ్యతిరేకిస్తూ, మరోవైపు మిలాఖత్ కొనసాగిస్తున్న తీరు చర్చనీయాంశం అవుతోంది.


Related News

jayaprakash narayan

జేపీకి అది ద‌క్కుతుందా?

Spread the loveలోక్ స‌త్తా అధినేత చూపులు హ‌స్తిన వైపు మ‌ళ్లాయి. ఢిల్లీ రాజ‌కీయాల వైపు ఆయ‌న చూస్తున్నారు. కానీRead More

shivaji

హీరో శివాజీపై బీజేపీ దాడి

Spread the loveబీజేపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. ప్ర‌త్యేక హోదా కోసం నిన‌దిస్తున్న వారిపై బౌతిక దాడులు ప్రారంభించారు. తాజాగా సినిమాRead More

 • బ్రేక‌ప్ కి బాబు డిసైడ్…!
 • క‌మల వ్యూహంలో టీడీపీ విల‌విల‌లాడాల్సిందేనా?
 • సంచలనంగా మారిన జగన్ ప్రకటన
 • పవన్ కి ప్రయాస తప్పదు..!
 • బాబుకి బడ్జెట్ భయం!
 • కేంద్రమంత్రి తీరుపై చంద్రబాబు గుర్రు..
 • బడ్జెట్ పై బాబు రెండు కళ్ల సిద్ధాంతం
 • సోము వీర్రాజుకి మళ్లీ నిరాశే..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *