Main Menu

చంద్ర‌బాబు అభ్య‌ర్థుల క‌స‌ర‌త్తు ల‌క్ష్యం నెర‌వేరేనా?

Spread the love

ఏపీలో తెలుగుదేశం పార్టీ గ‌తానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. చివ‌రి నిమిషం వ‌ర‌కూ ఊరించి, నామినేష‌న్ల గుడువు ముగిసిపోయే స‌మ‌యంలో బీఫారం అందించే ల‌క్ష‌ణాన్ని చంద్ర‌బాబు వ‌దిలించుకున్నార‌నే ప్ర‌చారం మొద‌ల‌య్యింది. అయితే వాస్త‌వం ప‌రిశీలిస్తే దానికి భిన్నంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇటీవ‌ల ప‌త్రిక‌ల్లో ప‌లువురు అభ్య‌ర్థిత్వాలు ఖ‌రార‌యిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. తెలుగుదేశం క్యాండిడేట్స్ ఖాయం అయిపోయిన లిస్టు ఇదేనంటూ ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ల్లో వ‌స్తున్నాయి. ఇత‌ర మీడియాలో కూడా అలాంటి క‌థ‌నాల ప‌రంప‌ర సాగుతోంది. కానీ అస‌లు విష‌యం గ‌మ‌నిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా టీడీపీ అధికారికంగా త‌మ అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించ‌డం లేదు. క‌నీసం చంద్రబాబు స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డం లేదు. అయినా కొంద‌రికి భ‌రోసా ఇస్తున్నారు. దానినే అభ్య‌ర్థిత్వాలు ఖ‌రారు కావ‌డం అన్న‌ట్టుగా చిత్రీక‌రించే ప‌ని సాగుతోంది. కానీ చివ‌రి నిమిషంలో మార్పులు జ‌ర‌గ‌వ‌నే గ్యారంటీ ఏమిటీ అనే ప్ర‌శ్న‌ల‌కు బుదులే లేదు. చంద్ర‌బాబు రాజ‌కీయ వ్యూహాల‌లో భాగంగా ఆఖ‌రి నిమిషంలో అనూహ్య మార్పులు త‌ప్ప‌వ‌ని టీడీపీ అధినేత గురించి తెలిసిన వారంతా అంగీక‌రిస్తారు. దాంతో చాలామంది చెబుతున్న‌ట్టుగా ఇప్పుడు చంద్ర‌బాబు హామీ ద‌క్కిన వారు, త‌మ పేరు పేప‌ర్లో చూసుకుని మురిసిపోయిన వారు ఆ త‌ర్వాత ఖంగుతినాల్సిన ప‌రిస్థితి వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు.

అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలు గ‌మనిస్తుంటే అస‌లు ల‌క్ష్యం వేరుగా ఉంద‌ని చెప్ప‌వచ్చు. ప్ర‌స్తుతం ప‌లువురు నేత‌లు టీడీపీ నుంచి జంపింగ్ చేసే ప‌నిలో ఉన్న త‌రుణంలో వారిని నిల‌బెట్టుకోవ‌డం ప్ర‌స్తుతం ఆయ‌న ముందున్న ప్ర‌ధాన క‌ర్త‌వ్యంగా క‌నిపిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే క్యాండిడేట్స్ ని ప్ర‌క‌టిస్తూ కొంద‌రిని, మీకు అవ‌కాశం ఉంటుంద‌ని ఊరిస్తూ మ‌రికొంద‌రినీ, ప్ర‌త్యామ్నాయంగా మ‌రో అవ‌కాశం ఉంటుంద‌ని ఇంకొంద‌రిని ఒడిసిప‌ట్టుకునే ప‌నిలో టీడీపీ అధినేత ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఈప్ర‌య‌త్నాలు ఏమేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.






Related News

వైసీపీ హోరు గాలి, టైమ్స్ నౌ తాజా స‌ర్వే

Spread the loveజాతీయ మీడియా సంస్థ‌ల స‌ర్వేల‌లో వైసీపీ హోరు గాలి వీస్తోంది. ఆపార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఖాయంగా క‌నిపిస్తోంది.Read More

వైసీపీ రెండో జాబితా ఎంపీ అభ్య‌ర్థులు

Spread the loveశ్రీకాకుళం- దువ్వాడ శ్రీనివాస్ విజ‌య‌న‌గ‌రం- బెల్లాని చంద్ర‌శేఖ‌ర్ విశాఖ‌ప‌ట్ట‌ణం-ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌ అన‌కాప‌ల్లి- డాక్ట‌ర్ స‌త్య‌వ‌తి కాకినాడ వంగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *