Main Menu

చంద్ర‌బాబు క్లియ‌రెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ వీళ్లే..!

Spread the love

వ‌చ్చే ఎన్నిక‌ల కోసం అభ్య‌ర్థుల విష‌యంలో టీడీపీ ముందంజ‌లో ఉంది. దాదాపుగా ప‌లు సీట్ల‌కు క్యాండిడేట్స్ ని క‌న్ఫ‌ర్మ్ చేసే ప‌నిలో చంద్ర‌బాబు ఉన్నారు. ప్ర‌తీ రోజూ ఒక జిల్లాకు సంబంధించిన రివ్యూ నిర్వ‌హిస్తూ సిట్టింగుల‌తో పాటు ప‌లువురు కొత్త వారికి కూడా క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఆక్ర‌మంలోనే ఎంపీ అభ్య‌ర్థులు దాదాపుగా ఖ‌రార‌యిన‌ట్టు క‌నిపిస్తోంది.

టీడీపీ సిట్టింగుల‌లో కొంద‌రు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ స్థానాల‌కు పోటీ చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు. అందులో తోట న‌ర‌సింహం, జేసీ దివాక‌ర్ రెడ్డి వంటి వారి వారున్నారు. ఇక బీజేపీ గెలిచిన రెండు సీట్లు, వైసీపీ సిట్టింగులున్న ఐదు సీట్ల‌లో కూడా టీడీపీ కొత్త నేత‌ల‌ను తెర‌మీద‌కు తీసుకువ‌చ్చే అవ‌కాశాలున్నాయి. ఇక ఫిరాయింపు ఎంపీలు ముగ్గురిలో ఎవ‌రికి ఛాన్స్ ద‌క్కుతుంద‌న్న‌ది సందేహంగా మారింది.

ఇక ప్ర‌స్తుతానికి ఖ‌రార‌యిన టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే..

1. కింజ‌ర‌పు రామ్మోహ‌న్ నాయుడు- శ్రీకాకుళం
2. అర‌కు- కిషోర్ చంద్ర‌దేవ్
3. విజ‌య‌న‌గ‌రం- అశోక్ గ‌జ‌ప‌తిరాజు
4. విశాఖ‌- గంటా శ్రీనివాస‌రావు లేదా భ‌ర‌త్
5 అన‌కాప‌ల్లి- స‌బ్బం హ‌రి లేదా చింత‌కాయ‌ల విజ‌య్
6. కాకినాడ – చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్
7. అమ‌లాపురం- హ‌రీష్ మాధుర్ లేదా గొల్ల‌ప‌ల్లి సూర్యారావు
8. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం- ముర‌ళీమోహ‌న్ లేదా రూపాదేవి
9. న‌ర్సాపురం- ర‌ఘురామ‌రాజు
10 ఏలూరు- మాగంటి బాబు
11. విజ‌య‌వాడ‌- కేశినేని నాని
12. మ‌చిలీప‌ట్నం- కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌
13. గుంటూరు- గ‌ల్లా జ‌య‌దేవ్
14. న‌ర్సారావుపేట‌- రాయ‌పాటి సాంబ‌శివ‌రావు
15. బాప‌ట్ల‌- మాల్యాద్రి లేదా వ‌ర్ల రామ‌య్య‌
16. ఒంగోలు – మాగుంట శ్రీనివాసుల రెడ్డి లేదా
17. నెల్లూరు- బీదా మ‌స్తాన్ రావు లేదా బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర‌రెడ్డి
18. క‌డ‌ప – ఆదినారాయ‌ణ రెడ్డి
19 రాజంపేట‌- డీకే శ్రీనివాస్
20. చిత్తూరు- శివ‌ప్ర‌సాద్
21. క‌ర్నూలు- కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి
22. నంద్యాల‌- ఎస్పీవై రెడ్డి
23. అనంత‌పురం- జేసీ ప‌వ‌న్
24. హిందూపురం- నిమ్మ‌ల కృష్ణ‌ప్ప‌
25. తిరుప‌తి- పెండింగ్


Related News

త‌మ్ముళ్ల‌కు ‘మెగా’ ఝ‌ల‌క్

Spread the loveమెగాస్టార్ ఝ‌ల‌క్ ఇచ్చారు. సోద‌రుల ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లారు. కుటుంబ‌మంతా ఒక్క‌టేన‌ని చాటేందుకు చిరంజీవితో ఓ ప్రెస్Read More

వైసీపీ హోరు గాలి, టైమ్స్ నౌ తాజా స‌ర్వే

Spread the loveజాతీయ మీడియా సంస్థ‌ల స‌ర్వేల‌లో వైసీపీ హోరు గాలి వీస్తోంది. ఆపార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఖాయంగా క‌నిపిస్తోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *