అడ్డంగా బుక్క‌యిన టీడీపీ!

tdp nandyal
Spread the love

ఆన్ లైన్ లో వైసీపీ దొరికింద‌ని సంబ‌ర‌ప‌డేలోగానే టీడీపీకి ఎదురుదెబ్బ త‌గిలింది. అనూహ్యంగా దొరికిపోయి అవ‌స్థ‌ల్లో ప‌డింది. నేరుగా ఓట‌ర్ల‌ను బెదిరించ‌డానికి సిద్ధ‌ప‌డుతోంద‌నే ప్ర‌చారానికి త‌గ్గ‌ట్టుగా ఆధారాలు దొర‌క‌డంతో అధికార పార్టీకి మింగుడుప‌డ‌ని అంశంగా మారింది. నంద్యాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ ప‌రిణామం తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ‌గా భావిస్తున్నారు.

రెండు రోజుల క్రితం ప్ర‌శాంత్ కిషోర్ బ్యాచ్ పుణ్యాన ఆన్ లైన్ లో వైసీపీ త‌ప్పిదాన్ని టీడీపీ ఎక్స్ పోజ్ చేసింది. టీడీపీ అనుకూల ప‌త్రిక‌ల్లో అదో పెద్ద వార్త‌గా మారింది. టీడీపీ నేత‌లు ఆందోళ‌న‌ల‌కు కూడా పూనుకున్నారు. పీకేతో క‌లిసి జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టే కుట్ర‌ప‌న్నుతార‌ని టీడీపీ నేత‌లు విమ‌ర్శించే వ‌ర‌కూ వెళ్లారు. డీజీపీకి ఫిర్యాదు కూడా చేశారు. కానీ అంత‌లోనే ఇప్పుడు తెలుగుదేశం త‌రుపున నంద్యాల ఓట‌ర్ల‌ను నేరుగా ప్ర‌లోభ‌పెట్ట‌డానికి తోడుగా భ‌య‌పెట్టే బ్యాచ్ త‌యారుకావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. చివ‌ర‌కు ఆ ముఠాలో ఇద్ద‌రు దొరికిపోవ‌డం క‌ల‌క‌లం రేపింది. ప‌ట్ట‌ప‌గ‌లు బాహాటంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా క‌థ న‌డుపుతున్న ఇద్ద‌రు విద్యార్థులు చేత‌చిక్క‌డంతో వైసీపీకి పెద్ద ఆయుదంగా మారింది.

నంద్యాల‌లో అమాత్యులు, ఎమ్మెల్యేలు స‌హా అధికార పార్టీ త‌రుపున పెద్ద సంఖ్య‌లో నేత‌లు పాగా వేశారు. వారికి తోడుగా ప్ర‌లోభ పెట్టే బృందాలు పెద్ద‌స్థాయిలో ఉన్నాయ‌ని ప్ర‌చారం సాగుతోంది. ముఖ్యంగా బీటెక్ చ‌దివిన కొంద‌రు యువ‌కుల‌ను బ‌రిలో దింపి వారితో ఓట‌ర్లను బెదిరించే కార్య‌క్ర‌మాల‌కు దిగ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. టీడీపీకి ఓటు వేయ‌క‌పోతే పెన్ష‌న్లు, రేష‌న్ కార్డులు ర‌ద్ద‌వుతాయ‌నే భ‌యాందోళ‌న క‌లిగించారంటూ ఇద్ద‌రు యువ‌కుల‌ను ప‌ట్టుకున్న త‌ర్వాత స్థానికులు చెబుతున్న దానిని బ‌ట్టి నంద్యాల‌లో టీడీపీ తీవ్రంగా స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. పాజిటివ్ ఓట్ తో కాకుండా నెగిటివ్ ఓటింగ్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. బెదిరించే ప్ర‌య‌త్నం చేయ‌డం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది.

ఇప్ప‌టికే చంద్ర‌బాబు నంద్యాల‌లోనే అలాంటి వ్యాఖ్య‌ల‌తో హీటు రాజేశారు. తాము ఇచ్చిన పెన్ష‌న్ తీసుకుంటూ, వేసిన రోడ్ల‌మీద న‌డుస్తూ ఓటెందుకు వేయ‌ర‌ని ఆయ‌నే ప్ర‌శ్నించారు. ఇక ఇప్పుడు త‌మ్ముళ్లు దానికి కొన‌సాగింపుగా ఓటేయ‌క‌పోతే పెన్ష‌న్లు ర‌ద్దు చేసేస్తామ‌ని చెబుతున్నారు. రేష‌న్ కార్డులు తొల‌గిస్తామ‌ని చెబుతున్నారు. దాంతో ఈ వ్య‌వ‌హారం పెనుదుమారం రేప‌డం ఖాయంగా ఉంది. ఇద్ద‌రు యువ‌కుల‌ను ప‌ట్టుకున్న స్థానిక వైసీపీ నేత‌లు వారిని పోలీసుల‌కు అప్ప‌గించ‌డం, వారు చెబుతున్న దానిని బ‌ట్టి న‌ర్సాపురం స్వ‌ర్ణాంధ్ర ఇంజ‌నీరింగ్ కాలేజీలో చ‌దువుకున్న విద్యార్థి ఒక‌రు, మ‌రో విద్యార్థి క‌లిసి ఇలాంటి వ్య‌వ‌హారాల‌కు దిగ‌డం గ‌మ‌నార్హం, ఇలాంటి బృందాలు ఏకంగా ప‌గో జిల్లా నుంచి నంద్యాల వ‌ర‌కూ రావ‌డం కూడా ఆశ్చ‌ర్యంగా ఉంది. మొత్తంగా చంద్ర‌బాబు అండ్ కో కి ఈ ప‌ట్టుబ‌డిన యువ‌కుల ఉదంతం పెద్ద త‌ల‌నొప్పి తీసుకురావ‌డం ఖాయంగా ఉంది.


Related News

Chandrababu-naidu-serious-on-media-houses

ముందస్తు ఎన్నికలు ఖాయం అంటున్న ముఖ్యమంత్రి

Spread the love5Sharesదేశంలో ముందస్తు ఎన్నికల సంకేతాలు వచ్చేశాయి. చంద్రబాబు స్వయంగా ఈ విషయం ప్రకటించారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధంRead More

pawan-mahesh kathi-colalge

కత్తి మహేష్ మనసు మార్చుకోవడం వెనుక..

Spread the love5Sharesకత్తి మహేష్ మనసు మార్చుకున్నారు. హఠాత్తుగా ఫిర్యాదుని సైతం ఉపసంహరించుకున్నారు. నిర్ణయం మార్చుకుని సామరస్యపూర్వకంగా స్వీట్లుపంచుకున్నారు. సెల్పీలుRead More

 • బాబు, జగన్ కూడా అదే నియోజకవర్గంలో…
 • పరువు కాపాడుకోవడానికి బాబు…
 • పవన్ మాట విని పరువు తీసిన చంద్రబాబు
 • ఆ లేఖ ఫేక్
 • జనసేనానికి తలైవా పాఠం?
 • పోలవరంలో కొత్త తగాదా
 • రాజమౌళికి షాకిచ్చిన రాజధాని
 • రంగంలోకి జేసీ సన్స్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *