Main Menu

జనసేన మీద దాడి ప్రారంభించిన తమ్ముళ్లు

tdp-janasena-pawan-647x450
Spread the love

తెలుగుదేశం తీరు మారుతోంది. నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు ఆపార్టీని జోష్ లో ముంచుతున్నాయి. చంద్రబాబు సాగించిన కార్యక్రమాలకు నంద్యాల ప్రజలు పట్టం కట్టారని చెబుతున్నారు. ఇక ఏపీలో సైకిల్ జోరుకి తిరుగుండదని నమ్ముతున్నారు. విపక్షం మీద మరింత దూకుడు పెంచడానికి సన్నద్ధమవుతున్నారు. గేరు మారుస్తానని చంద్రబాబు ప్రకటించగానే తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. విపక్షం తో పాటు మిత్రపక్షం మీద కూడా కత్తులు నూరుతున్నారు. కయ్యానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా నంద్యాల ఉప ఎన్నికల జోరులో అటు జనసేనని, ఇటు బీజేపీని తూర్పారపడుతున్నారు. ఇరుపక్షాలు టీడీపీ ఓటమి కోసం ఎదురుచూసినా సైకిల్ స్పీడ్ తగ్గలేదని నిరూపించామని సవాల్ చేస్తున్నారు. సోషల్ మీడియా పోస్టలతో అమిత్ షాని, ఫీకేని ఏకిపీకేస్తున్నారు.

నేరుగా టీడీపీ ప్రతినిధులుగా కనిపించే కొందరు ప్రముఖులు ఇలాంటి వ్యాఖ్యలు బహిరంగంగానే చేస్తున్నారు. తాజాగా టీవీ5 చర్చల్లో సీ నరసింహరావు చేసిన కామెంట్స్ దానికి సాక్ష్యంగా ఉన్నాయి. మూడుళ్ల క్రితం జనసేన మద్ధతుతో టీడీపీ 3వేల ఓట్లతో ఓడిన చోట ఇప్పుడు 27వేల ఓట్లతో జనసేన మద్దతు లేకుండానే గెలిచామని చెప్పుకొచ్చారు. తద్వారా జనసేన విషయంలో టీడీపీ పునరాలోచన చేస్తున్నట్టు కనిపిస్తోంది. నిజంగా దూరంగా పెట్టాలని లేకపోయినా కేవలం అలా కనిపిస్తే జనసేన తమ దగ్గరకు వస్తుందని ఆశిస్తుందని భావించాల్సి వస్తోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాల్సి వస్తే సీట్ల ఎంపిక విషయంలో తమకు ఆటంకం లేకుండా చేయడానికి టీడీపీ ఇప్పటి నుంచే పథక రచన చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

అదే సమయంలో బీజేపీతో కూడా. వాస్తవానికి చంద్రబాబు బీజేపీని వీడగలిగే అవకాశం లేదు. అదే జరిగితే ఆయనకు పలు సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి బీజేపీ బంధం కొనసాగిస్తూనే ఏపీ కమలదళాన్ని కంట్రోల్ చేసే రీతిలో చంద్రబాబు వ్యూహాలున్నట్టు కనిపిస్తోంది. నంద్యాలలో బీజేపీని దూరం పెట్టి కూడా గెలవగలిగామని, కాబట్టి తమ బలం పెరిగిందని మిత్రపక్షాలను కూడా కార్నర్ చేయడానికి తగ్గట్టుగా కథ నడుపుతున్నారు. వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్నది వేచి చూడాల్సిన అంశమే గానీ టీడీపీ శ్రేణులు మాత్రం ఎదురుదాడి మంత్రం తీవ్రం చేయడం ఖాయంగా ఉంది. తద్వారా విపక్ష, మిత్రపక్షాలన్న బేధం లేకుండా ఏపీని తామే శాసించాలని టీడీపీ ఆశిస్తోంది.


Related News

Chandrababu-AP-police.jpeg

బాబు తీరుపై ఐపీఎస్ ల అసంతృప్తి

Spread the loveఏపీకి మ‌రో పోలీస్ బాస్ అనివార్యం అవుతోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు బాసుల ప‌ద‌వీకాలం ముగియ‌గా, తాజాగా మాల‌కొండ‌య్య‌కుRead More

jyothi survey

ఆంధ్ర‌జ్యోతి స‌ర్వే వెనుక అస‌లు క‌థ‌

Spread the loveఆంధ్ర‌జ్యోతి స‌ర్వేలో టీడీపీ గెల‌వ‌క‌పోతే ఆశ్చ‌ర్యం గానీ, అధికార పార్టీకి మ‌రోసారి అంద‌లం ద‌క్క‌డంలో ఎటువంటి సంభ్ర‌మాశ్చ‌ర్యంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *