Main Menu

వైఎస్ జ‌గ‌న్ పీఏ పేరుతో వ‌సూళ్లు

Spread the love

వైసీపీ అధినేత‌, ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పీఏ వ్య‌వ‌హారం వార్త‌ల‌కెక్కింది. జ‌గ‌న్ పీ ఏ పేరుతో సాగిన వ‌సూళ్ల దందా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ‌గ‌న్ వ్యక్తిగత సహాయకుడు కేఎన్నార్‌ అధికారిక సెల్‌ఫోన్‌ నంబర్‌ స్పూఫింగ్ కి గుర‌యిన‌ట్టు ఆపార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. విచారించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

స్ఫూపింగ్ పరిజ్ఞానాన్ని వినియోగించి పలువురికి ఫోన్‌కాల్స్‌ చేస్తున్న ఆగంతకులు వైఎస్‌ జగన్‌ మాదిరిగా మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు. నేరగాళ్లు కొన్ని వాట్సాప్‌ నంబర్ల ద్వారా చాటింగ్‌లోకి కూడా వస్తున్నార‌ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు పక్షం రోజులుగా పలువురు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే లు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు వివిధ నియోజకవర్గాలకు చెందిన కన్వీనర్లకు వ‌చ్చిన‌ట్టు హైదరాబాద్‌ సిటీ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌కు అందించిన‌ ఫిర్యాదులో వైసీపీ నేత‌లు పేర్కొన్నారు.

కేఎన్నార్‌ వినియోగిస్తున్న సెల్‌ఫోన్‌ నంబర్‌ లోటస్‌ పాండ్‌లోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయం పేరుతో ఉంది. వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులు, నేతలతో సంప్రదించాలని భావించినప్పుడు కేఎన్నార్‌ ఈ నంబర్‌ ద్వారానే వారికి కాల్స్‌ చేస్తుంటారు. పార్టీకి చెందిన కీలక నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులతోపాటు వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తల సెల్‌ఫోన్లలో ఈ నంబర్‌ ఫీడ్‌ అయి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నంబర్‌ను సంగ్రహించిన కొందరు దుండగులు సైబర్‌ నేరానికి పాల్పడ్డారు. ఇంటర్నెట్‌లో లభించే స్పూఫింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఆధారం గా ఈ నెల 10వ తేదీ నుంచి వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలకు ఫోన్‌ కాల్స్‌ చేయడం ప్రారంభించారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ సైబ‌ర్ పోలీసులు ఈ కేసులో ద‌ర్యాప్తు ప్రారంభించ‌డంతో ఈ వ్య‌వ‌హారంలో ఎవ‌రెవ‌రి పాత్ర ఉంద‌న్న‌ది బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. అయితే ఈ కాల్స్ అన్నీ విదేశాల నుంచి వ‌స్తుండ‌డంతో ఏమేర‌కు అస‌లు వాస్త‌వం బ‌య‌ట‌ప‌డుతుంద‌న్న‌ది అనుమానంగానే క‌నిపిస్తోంది.






Related News

మ‌ళ్లీ టీడీపీ, జ‌న‌సేన క‌ల‌యిక‌కి కార‌ణాలివే

Spread the loveచాలాకాలంగా ఏపీ రాజ‌కీయాల్లో తెలుగుదేశం తీరు మీద ఓ కామెంట్ ఉంది. చంద్ర‌బాబు ఒంట‌రిగా ఎన్నిక‌ల‌ను ఎదుర్కోలేర‌న్న‌దిRead More

ష‌ర్మిళ కేసులో టీడీపీ ఎంపీకి చిక్కులు త‌ప్ప‌వా?

Spread the loveష‌ర్మిళ వ్య‌వ‌హారం ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. వైఎస్ ష‌ర్మిళ మీద టీడీపీ ఎంపీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *