హోరెత్తుతున్న హోదా

80abe982-3ef4-4ada-b682-92f031e591ea
Spread the love

ఏపీకి ప్రత్యేక హోదా నినాదం హోరెత్తిపోతోంది. ఏపీ అంతటా నిరసనల హోరు వినిపిస్తోంది. అన్ని పార్టీలు ఆందోళనలు సాగిస్తున్నాయి. జనసేనాని, వామపక్షాలతో కలిసి పాదయాత్రలు చేపట్టారు. వైసీపీ రాజీనామాలతో అనేక చోట్ల నిరసన దీక్షలు చేపట్టింది. టీడీపీ సైకిల్ ర్యాలీలు సాగిస్తోంది. కాంగ్రెస్ సత్యమేవ జయతే పేరుతో దీక్షలు, ఇతర రూపాల్లో ఆందోళనలు సాగిస్తోంది. దాంతో ఏపీలో కేవలం బీజేపీ మినహా అన్ని పార్టీలు, వివిధ వర్గాల ప్రజలు నిరసనల్లో భాగస్వాములవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దాంతో విపక్షాలు సహా, ఏపీలో అధికార పార్టీ కూడా ఆందోళనలు పాల్గొంటుండడంతో రాష్ట్రమంతా హోదా నినాదంతో అట్టుడుకుతోంది. అన్నివర్గాలు ఆందోళనలకు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడంతో ఈ వేడి మరింత రాజుకునే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ రోడ్డెక్కడం విశేషంగా చెప్పవచ్చు. తొలిసారిగా పవన్ జనసేన అధినేతగా ఆందోళనలో పాల్గొన్నారు. రోడ్డు మీద పవన్ వెంట వేలమంది అభిమానులు నడవడంతో హోదా , విభజన హామీల అమలు కోసం సాగుతున్న పోరాటం మరో దశకు చేరినట్టుయ్యింది.

ఇక చంద్రబాబు కూడా తాను వెనుకబడి పోకూడదని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోొంది. పోటాపోటీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సైకిల్ తొక్కేశారు. పార్టీ శ్రేణులంతా ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొత్తంగా హోదా వేడి మరింత రాజేశారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఇప్పుడు హోదా చుట్టూ నేతలంతా ప్రదిక్షణలు చేస్తున్నారు. పార్లమెంట్ కూడా వాయిదాపడడంతో ఇక ఢిల్లీ నుంచి సీన్ అమరావతికి మారిపోయినట్టుగానే భావించాలి.


Related News

cbn deeksha

బాబుని మోడీ లైట్ తీసుకుంటున్నారా…?

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న పుట్టిన రోజు నాడు కూడా రిలేదీక్ష సాగిస్తున్నారు. భారీ ఏర్పాట్ల మ‌ధ్యRead More

YS-Jagan-Mohan-Reddy_0

రాజీనామాకి రెడీ అయిన జ‌గ‌న్!

Spread the love22Sharesఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న ప‌ద‌వికి రాజీనామా యోచ‌న‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌జాసంకల్ప‌యాత్ర‌లోRead More

 • గేరు మార్చిన ముద్ర‌గ‌డ
 • జగన్ ముందున్న అతి పెద్ద సవాల్ అదే..
 • హోరెత్తుతున్న హోదా
 • ఫ‌లించిన చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు
 • వైసీపీ పోరు కొత్తదారిలో…
 • స‌ర్వే: చంద్ర‌బాబుని వెన‌క్కి నెట్టిన జ‌గ‌న్
 • ఐదుగురు ఎంపీలే రాజీనామాలు!
 • ఇరుక్కున్న వైసీపీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *