Main Menu

సోము వీర్రాజుకి మళ్లీ నిరాశే..

Spread the love

ఏపీ కమలదళాధిపతి వ్యవహారంలో మార్పులు లేవని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. మరోసారి విశాఖ ఎంపీకే ఛాన్స్ దక్కింది. కంభంపాటి హరిబాబుని ఆంధ్రప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడిగా కొనసాగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దాంతో ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి ఛాన్స్ మిస్సయ్యింది. ఆయన్ని నిరాశపరిచింది. చాలాకాలంగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని ఆయన ఆశిస్తున్నారు. గతంలో వెంకయ్య నాయుడు ఆయనకు అడ్డంకి వేశారు. ధానిపై తన అసంత్రుప్తిని సోము వీర్రాజు బాహాటంగానే బయటపెట్టారు. ప్రస్తుతం వెంకయ్య క్రియాశీల రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ సోము మాత్రం ఛాన్స్ దక్కించుకోలేకపోయారు. రామ్ మాధవ్ వంటి వారి అండదండలున్నప్పటికీ ఆయన లక్ష్యం మాత్రం నెరవేరలేదు. దాంతో మరోసారి విశాఖ ఎంపీ తన పీఠాన్ని కాపాడుకున్నారు.

వచ్చే పది, పదిహేను రోజుల్లో ఏపీ భాజపా కార్యవర్గం ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీతో సంబంధాలపై జాగ్రత్తలు పాటించాలని అధిష్టానం పలు సూచనలు చేసింది. జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది.






Related News

చంద్ర‌బాబు అభ్య‌ర్థుల క‌స‌ర‌త్తు ల‌క్ష్యం నెర‌వేరేనా?

Spread the loveఏపీలో తెలుగుదేశం పార్టీ గ‌తానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. చివ‌రి నిమిషం వ‌ర‌కూ ఊరించి, నామినేష‌న్ల గుడువు ముగిసిపోయేRead More

టీడీపీని వీడ‌బోతున్న మూడో ఎంపీ ఆయ‌నే..!

Spread the loveగోద‌వ‌రి జిల్లాల తెలుగుదేశం రాజ‌కీయాల్లో తోట బ్ర‌ద‌ర్స్ త‌ల‌నొప్పిగా త‌యార‌య్యారు. ఇప్ప‌టికే తోట త్రిమూర్తులు త‌న పార్టీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *