Main Menu

సీనియర్ మంత్రి కి ఝలక్

Spread the love

ఏపీ మంత్రికి షాక్ తగిలింది. వైసీపీ నుంచి ఊహించని ఎదురుదెబ్బతో సీనియర్ మంత్రి కి ఝలక్ తగిలినట్టయ్యింది. ఇప్పటికే పలువురు టీడీపీ నేతల కుటుంబీకులే వైసీపీలో చేరుతున్న విషయం అందరికీ తెలిసిందే. బుద్ధా వెంకన్న సోదరుడు సహా పలువురు ఈ లిస్టులో ఉన్నారు. అదే పరంపరలో సోమిరెడ్డి సోదరుడు కూడా చేరిపోయారు.

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి మరోసారి పోటీకి సిద్ధమవుతున్న వేళ మంత్రికి సోదరుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డికి ఊహించని షాక్‌ ఇచ్చారు.. సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి సోదరుడు సోమిరెడ్డి సుధాకర్‌ రెడ్డి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు సుధాకర్‌ రెడ్డి. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి అవినీతి…అక్రమాలు సహించలేకే పలువురు టీడీపీని వీడుతున్నారని అన్నారు. కాగా ఇప్పటికే సోమిరెడ్డికి స్వయానా బావ అయిన రామకోటారెడ్డి వైఎస్సార్‌ సీపీలో చేరిన విషయం విదితమే.

మరోవైపు జిల్లావ్యాప్తంగా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సమక్షంలో రామతీర్థం మాజీ శివాలయం చైర్మన్‌ శ్రీనివాసులు, కరుణాకర్‌, మురళితో పాటు పలువురు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు.






Related News

త‌మ్ముళ్ల‌కు ‘మెగా’ ఝ‌ల‌క్

Spread the loveమెగాస్టార్ ఝ‌ల‌క్ ఇచ్చారు. సోద‌రుల ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లారు. కుటుంబ‌మంతా ఒక్క‌టేన‌ని చాటేందుకు చిరంజీవితో ఓ ప్రెస్Read More

వైసీపీ హోరు గాలి, టైమ్స్ నౌ తాజా స‌ర్వే

Spread the loveజాతీయ మీడియా సంస్థ‌ల స‌ర్వేల‌లో వైసీపీ హోరు గాలి వీస్తోంది. ఆపార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఖాయంగా క‌నిపిస్తోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *