టీడీపీ ఆశ‌లు నీరుగార్చిన ఈసీ

shilpa
Spread the love

నంద్యాల ఉప ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిపోవ‌డంతో ప్ర‌తీ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని అధికార టీడీపీ భావిస్తోంది. కానీ ఈసీ వారి ఆశ‌లపై నీళ్లు జ‌ల్లుతోంది. ఇప్ప‌టికే కొత్త ఓట‌ర్ల విష‌యంలో స‌ర్కారుకి చెంపపెట్టు త‌గిలింది. తాజాగా శిల్పా నామినేష‌న్ వ్య‌వ‌హారం చుట్టూ వివాదం రాజేసినా చివ‌ర‌కు కోరిక ఫ‌లించ‌లేదు. ఆయ‌న నామినేష‌న్ కొట్టేసే అవ‌కాశం ఉంద‌ని చేసిన ప్ర‌చారం ఈసీ తోసిపుచ్చ‌డంతో టీడీపీ ఆశ‌ల‌పై నీళ్ల జ‌ల్లిన‌ట్ట‌య్యింది.

నంద్యాల ఉప ఎన్నిక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. టీడీపీ అభ్యంతరాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తోసిపుచ్చారు. నోటరీ రెన్యువల్‌ అంశాన్ని, స్టాంప్‌ పేపర్‌పై అదనపు అఫిడవిట్‌ ఇ‍వ్వలేదంటూ టీడీపీ మెలికపెట్టినప్పటికీ వాటిని.. ఈసీ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో శిల్పా నామినేష‌న్ చుట్టూ సాగిన ప్ర‌చారానికి ఈసీ పుల్‌స్టాప్‌ పెట్టినట్లు అయింది. కాగా నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పరిశీలన నేటితో ముగిసింది. మరోవైపు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్‌ కూడా ఈసీ ఆమోదించింది.


Related News

jagan-vijaya-645-06-1486361225-06-1499360204

విజయసాయికి అసలైన పరీక్ష

Spread the love19Sharesవైసీపీ నాయకుడిగా పార్లమెంట్ లో మంచి మార్కులు కొట్టేశారు. పలువురి ప్రశంసలందుకున్నారు. ప్రశ్నలు వేయడంలోనూ, చర్చల్లోనూ, నిధులRead More

ysrcp

వైసీపీలో కీలక వైశ్య నేత

Spread the love124Sharesవైసీపీకి కొత్త వర్గాల్లో ఆదరణ పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్టు కనిపిస్తోంది.Read More

 • టీడీపీకి ఎదురుదెబ్బ: జ్యోతుల గుడ్ బై
 • నంద్యాలలో జగన్ కి షాక్
 • నంద్యాలలో బాలయ్య శిల్పా మీద ఫైర్
 • అవేం మాటలు ఆది…
 • చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలు
 • కాపులు చ‌ల్లారతారా? కొత్త చిచ్చు రాజేస్తారా??
 • చిన‌జీయ‌ర్ వివాదంలో దేవినేని ఉమా..!
 • జ‌గ‌న్ కేసుల్లో ఊర‌ట‌
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *