Main Menu

క‌మ‌లంలో కాక రాజుకుంది..

Spread the love

ఏపీలో క‌మ‌ల‌ద‌ళానికి క‌ష్టాలు మొద‌ల‌వుతున్నాయి. నాలుగేళ్లుగా దాదాపు హానీమూన్ సాగించిన టీడీపీ హ్యాండివ్వ‌డం ఖాయం అయ్యింది. ముహూర్తం పెట్ట‌డ‌మే మిగిలింది. దాంతో ఇరు పార్టీలు దాదాపుగా విడాకుల‌కు సిద్ధ‌మ‌యిన‌ట్టుగా చెప్ప‌వ‌చ్చు. దానికి తోడు ప్ర‌త్యేక హోదా, ఏపీ హ‌క్కులు సెంటిమెంట్ గా మారాయి. అది క‌మ‌ల‌నాథుల‌ను క‌ల‌వ‌రప‌రుస్తోంది. తీవ్రంగా చికాకు పెట్టేలా క‌నిపిస్తోంది. టీడీపీ త‌మ‌కు దూరం అవుతుంద‌న్న దానికి మించి త‌మ‌ను ఏపీ ప్ర‌జ‌ల ముందు దోషిగా నిల‌బెట్ట‌డంతో త‌ల్ల‌డిల్లిపోతున్నారు. తాము చేసింది చెబుతున్నా జ‌నం స్వీక‌రించే ప‌రిస్థితి లేద‌ని బీజేపీ నేత‌లు గుర్తించారు. అదే స‌మ‌యంలో గ‌డిచిన ఎన్నిక‌ల‌కు ముందు కాషాయం జెండాపై మోజుతో అటు వైపు మొగ్గిన నేత‌లు ఇప్పుడు తిరుగుట‌పా క‌డుతున్నారు. ఏపీలో బీజేపీకి సీన్ ఉండ‌ద‌ని గ్ర‌హించి అన్నీ స‌ర్థుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా బీజేపీ కి సీనియ‌ర్ నేత అద్దేప‌ల్లి శ్రీధ‌ర్ గుడ్ బై చెప్పేశారు. అంత‌కు ముందు ప్ర‌జారాజ్యం, కాంగ్రెస్ పార్టీల‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన శ్రీద‌ర్ కొన్నాళ్లుగా మీడియా సంస్థ‌ల్లో బీజేపీ స్వ‌రం వినిపించే వారు. కానీ ఇప్పుడు పార్టీ పూర్తిగా డిఫెన్స్ లో ప‌డిపోవ‌డంతో ఆయ‌న బీజేపీకి రాంరాం చెప్పేశారు. త్వ‌ర‌లో వైసీపీలో చేరే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.

రాజ‌మ‌హేంద్ర‌వరానికి చెందిన అద్దేప‌ల్లి శ్రీధ‌ర్ కాపు సామాజ‌కివ‌ర్గానికి చెందిన నేత‌. ఆయ‌న‌తో పాటుగా ఏపీలో కాపులంతా టీడీపీ, వైసీపీల‌కు ప్ర‌త్య‌మ్నాయంగా బీజేపీ వెంట వ‌స్తార‌ని చాలామంది ఆశించారు. కానీ తీరా చూస్తే అనుకున్నొద‌క‌టి..అయ్యిందొక‌టి అన్న చందంగా మారింది. కేంద్రం త‌మ‌ను అవ‌మానిస్తుంద‌నే అభిప్రాయం ఏపీ వాసుల్లో బ‌ల‌ప‌డింది. అది క‌మ‌ల‌నాధుల‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆపార్టీ నుంచి మ‌రికొంద‌రు నేత‌లు చేజారిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఆ జాబితాలో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ పేరు ప్ర‌ధానంగా వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఆయ‌న కూడా త‌న మాజీ బాస్ వైఎస్ త‌న‌యుడి చెంత‌కు చేరే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. పురందేశ్వ‌రి కూడా ప్ర‌త్యామ్నాయంగా వైసీపీ నేత‌ల‌తో ట‌చ్ లో ఉన్న‌ట్టు చెబుతున్నారు. ఇక మంత్రి కామినేని మాత్రం చంద్ర‌బాబు చెంత‌కు చేరుతూ టీడీపీ తీర్థం పుచ్చుకుంటార‌ని భావిస్తున్నారు. ఇంకా మ‌రికొంద‌రి పేర్లు కూడా ఈవ‌రుస‌లో వినిపిస్తున్నాయి.

మొత్తంగా ప‌లువురు నేత‌లు చేజారిపోతే ఏపీలో బీజేపీ మ‌ళ్లీ పాత స్థాయికి చేరిపోతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అసెంబ్లీలో బోణీ కొట్ట‌డ‌మే క‌ష్టంగా మారిపోయే ప్ర‌మాదం ఉంద‌ని భావిస్తున్నారు. అంతేగాకుండా బీజేపీతో జ‌త‌గ‌ట్ట‌డానికి కూడా ఏపీ లో పార్టీలు అంత సుముఖుత వ్య‌క్తం చేయ‌క‌పోవ‌చ్చ‌ని స‌మాచారం. అది కూడా క‌మ‌ల‌ద‌ళం క‌ష్టాల‌ను రెట్టింపు చేయ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. మొత్తంగా ఏపీలో ప్ర‌జ‌ల్లో రాజుకున్న సెంటిమెంట్ ని స‌కాలంలో గుర్తించి త‌గు ప‌రిష్కార మార్గాలు వెద‌క‌డంలో విఫ‌ల‌మ‌యిన మోడీ నేతృత్వంలోని బీజేపీకి గ‌ట్టి దెబ్బ త‌ప్ప‌ద‌నే అంచ‌నాలు పెరుగుతున్నాయి.


Related News

వైసీపీ ఖాతాలో మ‌రో ఎమ్మెల్యే

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య‌లో మ‌రో నెంబ‌ర్ తోడ‌య్యింది. వాస్తవానికి అధికారికంగా 67మందిని గెలిపించుకున్న ఈRead More

కేసీఆర్ సీఎం అయితే చంద్ర‌బాబుకి క‌ష్టాలే!

Spread the loveత్వ‌ర‌లోనే టీడీపీ కండువా క‌ప్పుకోబోతున్నట్టు ప్ర‌చారంలో ఉన్న మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *