పవన్ కి రేణూ పెళ్లి డ్యామేజ్?

renu desai
Spread the love

సినీ జీవితంలో కొన్ని అంశాలు పెద్దగా ప్రభావం చూపవు. వ్యక్తిగత జీవితానికి, తెరమీద వ్యవహారాలను ముడిపెట్టడానికి అభిమానులు నిరాకరిస్తున్నారు. అందుకే బాలయ్య లాంటి వాళ్లు బయట పదే పదే ఫ్యాన్స్ మీద దాడికి పాల్పడినా నటుడిగా బాలయ్య మీద అభిమానం తగ్గుతున్నట్టు కనిపించదు. అలానే ఇతర నటుల విషయంలో కూడా అంతే. కానీ పొలిటిక్స్ దానికి భిన్నం. ఒకసారి పబ్లిక్ లోకి వస్తే ఏమయినా అంటామంటూ అప్పట్లోనే శ్రీ శ్రీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అందుకే రాజకీయాలలో వేరుగా ఉంటుంది. అందుకు ఉదాహరణ గతంలోనే పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల మీద ప్రత్యర్థులు చేసిన విమర్శలను చెప్పుకోవచ్చు.

ఇక ఇప్పుడు తాజాగా పవన్ రెండో భార్య రేణూదేశయ్ విడాకులు తీసుకుని కొన్నేళ్లుగా ఒంటరిగా జీవిస్తోంది. కానీ ఇటీవల తనకు ఒంటరితనం ఇబ్బందిగా ఉందని, తోడు ఉంటే శ్రేయస్కరమని భావిస్తున్నట్టు త్వరలోనే రెండో పెళ్లికి సంబంధించిన సంకేతాలిచ్చింది. ఆ విషయాన్ని అంతటితో ఆపితే సరిపోయేది. ఆ మె వ్యక్తిగత వ్యవహారంగా భావించి ఉండాల్సింది. కానీ కొందరు పవన్ ఫ్యాన్స్ శ్రుతిమించి వ్యవహరించారు. ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో హద్దూ పద్దూ లేదన్నట్టుగా ప్రవర్తించారు. చివరకు రేణూదేశయ్ కి చికాకు కలిగించారు. దాంతో ఆమె నేరుగా అలాంటి స్క్రీన్ షాట్లతో ఎఫ్ బీ లో పోస్టు పెట్టి సంచలనం రేపారు.

ఇది ఇప్పుడు పవన్ కల్యాణ్ కే తలనొప్పిగా మారుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవలే కత్తి మహేష్ విషయంలోనూ కొంత అతిగా ప్రవర్తించి అభాసుపాలయ్యారు. అదే విధంగా రేణూదేశాయ్ పెళ్లి విషయంలోనూ ప్రవర్తించి పరువు కోల్పోయారు. ఇలాంటి విషయంలో పవన్ కల్యాణ్ ద్రుష్టి పెట్టకపోతే వ్యవహారం అసలుకే మోసం తెచ్చేలా కనిపిస్తోంది. అనవసరంగా వివాదాలుగా మారుతున్నట్టు కనిపిస్తోంది. గోటితో పోయే దానిని గొడ్డలి వరకూ తెచ్చుకున్నట్టు స్పష్టమవుతోంది. అభిమానులను హద్దుల్లో పెట్టకపోతే ఆయనకు రాజకీయంగా తలనొప్పులు తీసుకురావడం ఖాయం అని చెప్పవచ్చు.


Related News

YS-Jagan-Mohan-Reddy_0

రాజీనామాకి రెడీ అయిన జ‌గ‌న్!

Spread the loveఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న ప‌ద‌వికి రాజీనామా యోచ‌న‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌జాసంకల్ప‌యాత్ర‌లోRead More

mudragada-and-wife

గేరు మార్చిన ముద్ర‌గ‌డ

Spread the loveకాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం గేరు మార్చేశారు. గ‌డిచిన కొంత కాలంగా సైలెంట్ గా ఉన్నRead More

 • జగన్ ముందున్న అతి పెద్ద సవాల్ అదే..
 • హోరెత్తుతున్న హోదా
 • ఫ‌లించిన చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు
 • వైసీపీ పోరు కొత్తదారిలో…
 • స‌ర్వే: చంద్ర‌బాబుని వెన‌క్కి నెట్టిన జ‌గ‌న్
 • ఐదుగురు ఎంపీలే రాజీనామాలు!
 • ఇరుక్కున్న వైసీపీ
 • అవిశ్వాసంపై మారిన సీన్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *