Main Menu

జనసేనానికి తలైవా పాఠం?

RAJANI PAWAN
Spread the love

ఏపీ రాజకీయాల్లో జనసేనాని వ్యవహారం నిత్యం హాట్ టాపిక్ గానే ఉంటుంది. త్వరలోనే ఫుల్ టైమ్ పొలిటీషియన్ కాబోతున్న ఆయన ట్వీట్లు, ప్రకటనలు, పర్యటనలు అన్నీ ఆసక్తిగానే సాగుతున్నాయి. అయితే పార్టీ నిర్మాణం గానీ ఇతర వ్యవహారాలు గానీ ముందుకు సాగడం లేదు. ఇంటర్వ్యూలు, రాత పరీక్షల తర్వాత కోఆర్డినేటర్ల ఎంపిక అని చెప్పినప్పటికీ అది సక్రమంగా, సంపూర్ణంగా సాగినట్టు లేదు. దాంతో జనసేన కుంటి నడకన సాగుతుందన్న అభిప్రాయం బలపడుతోంది.

అదే సమయంలో తాజాగా తమిళనాడులో రజనీకాంత్ దూకుడు చూసిన తర్వాత చాలామంది పవన్ కల్యాణ్ కి రజనీ ఓ గుణపాఠం కావాలని ఆశిస్తున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ పార్టీ ప్రకటించిన ముందు ఎవరితోనూ చర్చలు జరిపినట్టు లేదు. కనీసం నిర్మాణం విషయంలో కూడా అభిమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదు. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత అభిమానులు అండగా నిలుస్తున్నారంతే. కానీ రజనీకాంత్ అలా కాదు..చాలాకాలంగా పొలిటికల్ ఎంట్రీ కోసం అభిమానులు కూడా అర్రులు చాస్తున్న నేపథ్యంలో ఆయన అందరితో సమావేశాలు నిర్వహించారు. వేలాది మంది అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఒకసారి కాదు..అనేకమార్లు అభిమానులతో భేటీలు నిర్వహించారు. చివరకు తన నిర్ణయం ప్రకటించారు.

ఇక రజనీకాంత్ నిర్ణయంలో కూడా స్పష్టత కనిపిస్తోంది. రాజకీయంగా దూకుడు కనిపిస్తోంది. కొత్త పార్టీ పెడుతున్నానని, మొత్తం అన్ని స్థానాలకు పోటీ చేస్తానని రజనీ ప్రకటించేశారు. కానీ పదేళ్లుగా రాజకీయాల్లో ఉంటూ, నాలుగేళ్ల క్రితం పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ మాత్రం వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో మిత్రపక్షాలు బీజేపీ, టీడీపీతో బంధం కొనసాగించాలా లేదా అన్నది ఆయనకే క్లారిటీ లేదు. బీజేపీని వదిలించుకుని, టీడీపీతో కలిసి సాగితే లాభనష్టాల మీద అంచనాలు లేవు. దాంతో జనసేన పార్టీలో ఏ అంశంలో కూడా ఓ స్పష్టమైన విధానం కనిపించదు. చివరకు అన్ని స్థానాలకు పోటీ చేయబోతున్నట్టు ఓసారి ప్రకటించి, ఆ వెంటనే నాలుక్కరుచుకున్న స్థితి ఆపార్టీది.

దాంతో రజనీకాంత్ బాట పవన్ కి పనికొస్తుందనే వారు ఉన్నారు. అయితే రెండు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఏపీలో ఇద్దరు బలమైన నేతల మధ్య పోటీకి, తమిళనాట నాయకుడే కనిపించని స్థిితికి వైరుధ్యం ఉంటుంది. కానీ పార్టీ నిర్మాణం, ప్రజా సమస్యలపై పోరాటం, ఎన్నికల్లో తన పార్టీని బలోపేతం చేసుకోవాలనే దానిపై ఓ స్పష్టత వస్తేనే ఏ పార్టీ అయినా ముందుకెళుతుంది. క్యాడర్ లో నమ్మకం కలుగుతుంది. అసలు పోటీలో ఉంటుందో లేదో తెలియని పార్టీ, ఉంటే ఎన్ని స్థానాల్లో ఉంటుందో తెలియని పార్టీ పుంజుకోవడం కొంత కష్టమే. జనసేనాని ఎప్పటికి తెలుసుకుంటాడో ఏందో..


Related News

Chandrababu-AP-police.jpeg

బాబు తీరుపై ఐపీఎస్ ల అసంతృప్తి

Spread the loveఏపీకి మ‌రో పోలీస్ బాస్ అనివార్యం అవుతోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు బాసుల ప‌ద‌వీకాలం ముగియ‌గా, తాజాగా మాల‌కొండ‌య్య‌కుRead More

jyothi survey

ఆంధ్ర‌జ్యోతి స‌ర్వే వెనుక అస‌లు క‌థ‌

Spread the loveఆంధ్ర‌జ్యోతి స‌ర్వేలో టీడీపీ గెల‌వ‌క‌పోతే ఆశ్చ‌ర్యం గానీ, అధికార పార్టీకి మ‌రోసారి అంద‌లం ద‌క్క‌డంలో ఎటువంటి సంభ్ర‌మాశ్చ‌ర్యంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *