Main Menu

రాజమౌళికి షాకిచ్చిన రాజధాని

Spread the love

ఏపీ రాజదాని అమరావతి వ్యవహారం ఆశ్చర్యకరంగా మారుతోంది. ఆఖరికి సినీ దర్శకుడు బాహుబలిని రంగంలో దింపిన చంద్రబాబు చివరకు ఆయన ప్రతిపాదనలు కూడా తోసిపుచ్చారనే వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. నార్మన్ ఫోస్టర్ సంస్థ తన డిజైన్లను అంగీకరించలేదని రాజమౌళి స్వయంగా చెప్పడం విశేషంగా మారింది.

అమరావతిలో అసెంబ్లీ నిర్మాణానికి సంబంధిచి ఒక డిజైన్ ఒకే అయ్యిందని జక్కన్న ప్రకటించారు. తనను మార్పులు చేయమని సీఎం చంద్రబాబు సూచించారని, కానీ తన మార్పులను నార్మన్ ఫోస్టర్ సంస్థ అంగీకరించలేదని రాజమౌళి చెప్పారు. తెలుగుదనం ఉట్టిపడేలా కొన్ని మార్పులు సూచించానన్నారు. కానీ.. తను వర్క్ చేసిన డిజైన్ ఒకే కాలేదన్నారు. అదే ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది. ఏరికోరి పెట్టుకున్న వ్యక్తి సూచనలను పరిగణలోకి తీసుకోకపోవడం విశేషంగా మారింది.

అయితే తను సూచించిన మార్పులను మీడియాసిటీకి వాడుకుంటామని చెప్పినట్లు రాజమౌళి పేర్కొనడం ఆసక్తిగా మారింది. రామసేతు నిర్మాణంలో ఉడత పోషించిన పాత్ర.. తాను రాజధాని నిర్మాణంలో పోషిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చుకున్న రాజమౌళి, తన ప్రతిపాదనలు ముందుకు సాగకపోవడం పట్ల కొంత అసంత్రుప్తి ఉన్నట్టు కనిపిస్తోంది.






Related News

కోర్ట్ కి దూరంగా సీఎం చంద్ర‌బాబు

Spread the love5Sharesఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఊహించిన‌ట్టుగానే కోర్ట్ కి హాజ‌రుకావ‌డం లేదు. ఆయ‌న కోర్టు మెట్లెక్కేందుకు సిద్ధ‌మంటూ వ‌చ్చిన ఊహాగానాల‌నుRead More

దేశంలోనే టాప్ 5లో జ‌గ‌న్

Spread the love15Sharesఏపీ విప‌క్ష నేత ఓ అరుదైన లిస్టులో చోటు సంపాదించారు. దేశంలోనే ఎమ్మెల్యేల జాబితాలో ఆయ‌న టాప్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *