పోలవరం సగం పూర్తయిపోయింది…

gatjarrii
Spread the love

పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్‌ నరసింహన్‌తో కలిసి పరిశీలీంచారు. నిర్మాణ పనుల ప్రగతిని జలవనరుల శాఖ అధికారులు గడ్కరీకి వివరించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశానికి కూడా జీవనాడి ప్రాజెక్టని, దీని నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ప్రస్తుతం నీరు ఎంతో అవసరమని.. పోలవరం ప్రాజెక్టు నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా ప్రధాని మోదీ సహకారంతో పూర్తిచేస్తామని అన్నారు.

పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేసి గ్రావిటీతో నీరిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. పోలవరం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. కుడి కాలువ పనులు 91శాతం.. ఎడమ కాలువ పనులు 57 శాతం పూర్తయినట్లు చెప్పారు. మొత్తంగా 50 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఇప్పటి వరకూ 20 సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించానని… 21వ సారి మంత్రి గడ్కరీతో కలిసి రావడం సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు. అంతకు ముందు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, సుజనాచౌదరితో పాటు సీఎం చంద్రబాబు, గవర్నర్‌ నరసింహన్ సందర్శించారు. పట్టిసీమ ఎత్తిపోతల డెలివరీ పాయింట్ వద్దకు చేరుకుని గోదావరి నీటికి పూజలు నిర్వహించారు.






Related News

association-international-dharamsala-sportzpics-himachal-celebrates-2017photo_aac8ae6c-dd73-11e7-8585-db66518b106f

శ్రీలంకకు ఊరట విజయం

Spread the loveమూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో భారత్‌పై లంక ఘన విజయంRead More

nara lokesh

నారా వారి లెక్కలు మామూలుగా లేవు..

Spread the loveముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుమారుడు, రాష్ట్ర మంత్రి లోకేశ్‌ తాజాగా ప్రకటించిన ఆస్తుల వివరాల్లో మాయాజాలం చోటుచేసుకుంది. ఎంఎల్‌సిగాRead More

  • బాబు భవితవ్యం తేల్చేసిన పవన్
  • నేను అనుకూలం..వ్యతిరేకం కాదు
  • పవన్ కల్యాణ్ మాట మీద నిలబడాలి…
  • చంద్రబాబు జైలుకే..
  • కాపులకు ఇది వరమా..కలవరమా?
  • తమ్ముళ్ల తీరుతో తల పట్టుకుంటున్న చంద్రబాబు
  • పోలవరం ఆపేస్తాం:చంద్రబాబు నిర్వేదం
  • జగన్, జ్యోతిలక్ష్మీ ఒకటే అంటున్న జేసీ
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *