Main Menu

టీడీపీలో మాజీ సీఎం త‌మ్ముడికి ముప్పుతిప్పలు

Spread the love

త‌న సోద‌రుడు సీఎం గా ఉన్న‌ప్పుడు చ‌క్రం తిప్పిన నాయ‌కుడు ఆయ‌న‌. సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మే కాకుండా రాష్ట్ర‌మంతా ఆయ‌న ఆదేశాలు అమ‌ల‌య్యేవి. అలాంటి నాయ‌కుడు అనూహ్యంగా టీడీపీ తీర్థం పుచ్చుకుని చాలామందిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అయిన‌ప్ప‌టికీ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కిర‌ణ్ కుమార్ రెడ్డి సోద‌రుడు కిషోర్ కి చుక్క‌లు క‌నిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే టీడీపీ సీనియ‌ర్ నేత కారపాకుల భాస్కర్‌నాయుడు త‌న‌కు పార్టీలో కనీస గుర్తింపు కూడా లేకపోయిందన్న అసంతృప్తితో ఇటీవలే మండలంలోని తన వర్గంతో కలసి పార్టీకి రాజీనామా చేశారు. గ‌త ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్‌ సుమారు నాలుగేళ్ళ పాటు పార్టీ ఇన్‌ఛార్జిగా వ్యవహరించి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కొంతకాలం గా పార్టీ కార్యకలాపాల పట్ల అంటీముట్టనట్టు ఉంటున్నారు. కిషోర్ కి స‌హ‌క‌రించే యోచ‌న‌లో ఆయ‌న లేర‌ని ప్ర‌చారం సాగుతోంది.

నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి మల్లారపు రవిప్రకాష్ కూడా అలాంటి ప‌రిస్థితే ఎదుర్కొంటున్నారు. సీఎం సొంత సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఆయ‌న
వాయల్పాడు మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి ఆశించినా రాలేదని అసంతృప్తిగా క‌నిపిస్తున్నారు. ర‌విప్ర‌కాష్ త్వ‌ర‌లోనే టీడీపీని వీడే సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఓవైపు బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థులు దూకుడు మీద ఉండ‌గా, సొంత గూటిలో చిక్కులు, టీడీపీ నేత‌లు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ఎన్నిక‌ల ముంగిట కిషోర్ కుమార్ కి స‌వాల‌క్ష స‌మ‌స్య‌లు త‌యార‌వుతున్నాయి. ఈ ప‌రిస్థితితో పీలేరు టీడీపీ ప్ర‌భావం స‌న్న‌గిల్లుతోంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది.






Related News

చంద్ర‌బాబు అభ్య‌ర్థుల క‌స‌ర‌త్తు ల‌క్ష్యం నెర‌వేరేనా?

Spread the loveఏపీలో తెలుగుదేశం పార్టీ గ‌తానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. చివ‌రి నిమిషం వ‌ర‌కూ ఊరించి, నామినేష‌న్ల గుడువు ముగిసిపోయేRead More

టీడీపీని వీడ‌బోతున్న మూడో ఎంపీ ఆయ‌నే..!

Spread the loveగోద‌వ‌రి జిల్లాల తెలుగుదేశం రాజ‌కీయాల్లో తోట బ్ర‌ద‌ర్స్ త‌ల‌నొప్పిగా త‌యార‌య్యారు. ఇప్ప‌టికే తోట త్రిమూర్తులు త‌న పార్టీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *