Main Menu

కొత్త కోర్టులో మొద‌టి పిల్ బాబు అవినీతిపైనే..!

Spread the love

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై కొత్త కేసు సిద్ధ‌మ‌య్యింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్ట్ ఏర్ప‌డిన త‌ర్వాత తొలిసారిగా చంద్ర‌బాబు వ్య‌వ‌హారాల‌పై న్యాయ‌విచార‌ణ జ‌ర‌గ‌బోతోంది. ఇప్ప‌టికే ఓమారు ఉమ్మ‌డి కోర్టులో వేసిన పిల్ ని తాత్కాలికంగా విర‌మించుకోవాల్సి వ‌చ్చింది. మ‌ళ్లీ పూర్తిస్థాయి ఆధారాల‌తో మాజీ జ‌డ్జి శ్ర‌వ‌ణ్ కుమార్ కోర్ట్ ముందుకు రావ‌డంతో క‌ల‌క‌లం రేపుతోంది.

చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు క‌లిసి వేల కోట్ల అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ గ‌త సెప్టెంబ‌ర్ లో పిల్ వేసిన శ్ర‌వ‌ణ్ కుమార్ ఆ త‌ర్వాత కోర్ట్ సూచ‌న‌తో దానిని విర‌మించుకున్నారు. పూర్తి ఆధారాలు కావాలంటూ కోర్ట్ ఆదేశించ‌డంతో వాటిని సేక‌రించి మ‌ళ్లీ న్యాయ‌స్థానం ముందుకు వెళుతున్న‌ట్టు చెబుతున్నారు. దాంతో ఇప్పుడీ కేసు రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేలకోట్ల రూపాయల భూములను డొల్లకంపెనీలకు దారాదత్తం చేయడంపై మాజీ న్యాయమూర్తి, ముందడుగు ప్రజాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జె శ్రవణ్ కుమార్ వేసిన ప్ర‌జాప్ర‌యోజ‌నాల వ్యాజ్యం శుక్ర‌వారం విచార‌ణ‌కు రాబోతోంది. సుమారు రెండువేల పేజీల డాక్యుమెంట్లను ఆధారాలుగా చూపుతూ కోర్ట్ కి స‌మ‌ర్పించిన‌ట్టు పిటీష‌న‌ర్ చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఏర్పడిన తరువాత మొట్టమొదటి ప్రజాప్రయోజన వ్యాజ్యంగా కేసు నమోదు కాబడింది. సీఎం అవినీతి పై తొలి ప్రజా ప్ర‌యోజ‌నాల వ్యాజ్యం న‌మోదు కావ‌డం ఇప్పుడు ఏపీలో ఆస‌క్తి రేపుతోంది.






Related News

మ‌ళ్లీ టీడీపీ, జ‌న‌సేన క‌ల‌యిక‌కి కార‌ణాలివే

Spread the loveచాలాకాలంగా ఏపీ రాజ‌కీయాల్లో తెలుగుదేశం తీరు మీద ఓ కామెంట్ ఉంది. చంద్ర‌బాబు ఒంట‌రిగా ఎన్నిక‌ల‌ను ఎదుర్కోలేర‌న్న‌దిRead More

ష‌ర్మిళ కేసులో టీడీపీ ఎంపీకి చిక్కులు త‌ప్ప‌వా?

Spread the loveష‌ర్మిళ వ్య‌వ‌హారం ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. వైఎస్ ష‌ర్మిళ మీద టీడీపీ ఎంపీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *