పవన్ మాట విని పరువు తీసిన చంద్రబాబు

Pawan-Kalyan
Spread the love

ఇదే చర్చ మొదలయ్యింది. తాజాగా కత్తి మహేష్, పవన్ ఫ్యాన్స్ తగాదాలో పూనమ్ కౌర్ ప్రస్తావన కలకలం రేపుతోంది. అది ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలతో ముడిపడిన విషయం కావడంతో రాజకీయంగానూ చర్చనీయాంశం అవుతోంది. పవన్ చెబితే చంద్రబాబు పదవి ఇచ్చారనే రీతిలో కత్తి ప్రశ్న సంధించారు. ఏపీలో చేనేత బ్రాండ్ అంబాసిడార్ గా పూనమ్ కౌర్ కి పదవి ఎవరు చెబితే ఇచ్చారంటూ కత్తి మహేష్ విసిరిన ప్రశ్నకు తెలుగుదేశం పెద్దలు కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.

వాస్తవానికి పూనమ్ తెలుగమ్మాయి కాదు. పైగా పాపులారిటీ కూడా లేదు. ఇప్పటికే ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్. అంతేగాకుండా వ్యక్తిగత వ్యవహారంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, సమస్యలతో ఉన్న నటి. అలాంటి పూనమ్ కౌర్ ని ఏరికోరి పదవి కట్టబెట్టడం వెనుక కారణాల గురించి కత్తి మహేష్ సంధించిన ప్రశ్నకు కొనసాగింపుగా, ఆమె ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆసుపత్రి బిల్లు కట్టిందెవరు, పూనమ్, పవన్ ఒకే గోత్రనామంతో గుడిలో పూజలేంటి అన్న ప్రశ్నలున్నాయి. దాంతో పవన్ కి, పూనమ్ కి మధ్య ఏదో జరిగిందనే విషయం తేటతెల్లం అవుతోంది. ఏపీలో చేనేతకి తాను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించుకున్న జనసేనాని చెప్పకుండా, మిత్రపక్షం తెలుగుదేశం ప్రభుత్వంలో పూనమ్ కౌర్ కి పదవి రాదనే విషయం స్పష్టమవుతోంది.

దాంతో అనేకనేక సందేహాలు ఇప్పుడు ముందుకొస్తున్నాయి. అదే సమయంలో ఏపీ పరువు మాత్రం ఇలాంటి వ్యవహారాలతో ముడిపడడం వివాదాస్పదం అవుతోంది. ఇప్పటికే స్వచ్ఛాంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసిన గజల్స్ శ్రీనివాస్ మసాజ్ వ్యవహారం తలవంపులు తెచ్చింది. ఇప్పుడు కత్తి మహేష్ ప్రశ్నలతో చేనేత బ్రాండ్ అంబాసిడర్ భాగోతం బయటపడుతోంది. దాంతో చంద్రబాబు పాలనలో ఎంపిక చేసిన సెలబ్రిటీల స్థాయి చర్చనీయాంశం అవుతోంది. బ్రాండ్ అంబాసిడర్ల పేరుతో ప్రభుత్వం నుంచి భారీగా తాయిలాలు అందిస్తూ ఖజానికి చిల్లు పెట్టడమే కాకుండా, ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తూ ఏపీ పరువు తీస్తున్నారనే విమర్శలకు ఆస్కారం కలుగుతోంది. దాంతో చంద్రబాబు, పవన్ కలిసి ఏపీ గౌరవాన్ని పూనమ్ కౌర్ రూపంలో ఎలా దిగజార్చారో అర్థమవుతోందనే వ్యాఖ్యానాలు వస్తున్నాయి.


Related News

jagancbn

బాబు, జగన్ కూడా అదే నియోజకవర్గంలో…

Spread the loveఏపీ ప్రతిపక్ష నేత ప్రజాసంకల్ప యాత్రలో ముందుకు సాగుతున్నారు. గడిచిన 60 రోజులుగా సాగుతున్న యాత్ర ఇప్పటికేRead More

chandrababu

పరువు కాపాడుకోవడానికి బాబు…

Spread the loveఅడుసు తొక్కనేల ..కాళ్లు కడగనేల అన్నట్టుగా మారింది చంద్రబాబు పరిస్థితి. మత్స్యకారులకిచ్చిన ఎన్నికల హామీని అమలుచేయమన్నందుకు ఆయనRead More

 • పవన్ మాట విని పరువు తీసిన చంద్రబాబు
 • ఆ లేఖ ఫేక్
 • జనసేనానికి తలైవా పాఠం?
 • పోలవరంలో కొత్త తగాదా
 • రాజమౌళికి షాకిచ్చిన రాజధాని
 • రంగంలోకి జేసీ సన్స్
 • కొత్త జిల్లాలకు చంద్రబాబు వెనకడుగు..
 • శ్రీలంకకు ఊరట విజయం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *