పవన్ కి ప్రయాస తప్పదు..!

undavalli_pawan_8045
Spread the love

ఏపీలో పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. అన్ని పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో సాగుతున్నాయి. ప్రత్యేక హోదా, ప్యాకేజ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీ ఆత్మగౌరవం సెంటిమెంట్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సొమ్ము చేసుకోవడానికి తగ్గట్టుగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నేతలు పార్లమెంట్ ముందు నడుపుతున్న ప్రహసనం పెద్దగా ఫలిస్తున్నట్టు కనిపించడం లేదు. దాంతో పవన్ కళ్యాణ్ కొంత ఆలశ్యంగా ఎంట్రీ ఇచ్చారు. చివరకు ప్రత్యేక హోదా బంద్ కి మద్దతు ప్రకటించినా ఆయన మాత్రం అటు వైపు కూడా చూడలేదు. అదే సమయంలో జయప్రకాష్ నారాయణ్ ని, ఉండవల్లిని తెరమీదకు తెచ్చి కొంత హల్ చల్ చేస్తున్నారు. తొలుత జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పినా ప్రస్తుతానికి జాయింట్ ఫ్యాక్ట్స్ కమిటీ పేరుతో సరిపెట్టుకున్నారు.

అయితే పవన్ చేసిన ప్రకటన ప్రకారం మరికొద్ది గంటల్లోగా చంద్రబాబు వాస్తవ లెక్కలు బయటపెట్టాలి. కేంద్రం నుంచి వచ్చిన నిధులెన్ని, చేసిన వ్యయం ఎంత అన్నది తెలియజేయాలి. కానీ ఏపీ ప్రభుత్వం దానికి సిద్దపడేలా లేదు. ముఖ్యంగా పవన్ నుంచి ఈ ప్రశ్న రాగానే టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. బీజేపీ వాళ్లు ఇఛ్చామంటున్నారు. మీరు తీసుకురాలేదంటున్నారు కాబట్టి వాస్తవ లెక్కలు కావాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ పోలవరం లెక్కల గురించి వెబ్ సైట్లో ఉన్నాయని దేవినేని ఉమా సూచించి చేతులు దులుపుకున్నారు. మరోవైపు కుటుంబరావు కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. కానీ అధికారికంగా పవన్ కళ్యాణ్ కోరినట్టుగా వివిధ పథకాల నిధుల వివరాలు మాత్రం అందలేదు.

దాంతో పవన్ కళ్యాణ్ ఆ లెక్కల ఆధారంగా ఏపీకి ఏం కావాలన్నది నిర్ణయించుకుని, పోరాడాలని భావిస్తుంటే ప్రభుత్వ స్పందన దానికి భిన్నంగా ఉంది. దాంతో ఈ వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. ఉండవల్లి, జేపీ జోక్యంతో పవన్ కూడా చంద్రబాబు మీద వేలెత్తి చూపక తప్పని స్థితి దాపురిస్తుందా అన్న సందేహం వస్తోంది. అయితే అలాంటి పరిస్థితి రాదని టీడీపీ నేతలతో పాటు రాజకీయ పరిశీలకులు కూడా భావిస్తున్నారు. కానీ ఉండవల్లి వంటి వారు జోక్యం చేసుకున్న తర్వాత పవన్ కి కొంత ఇబ్బందికర పరిస్థితి తప్పదు. తాజాగా ఉండవల్లి కూడా దానికి తగ్గట్టుగానే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే నిజమైన రాజకీయాలు చేస్తున్నారంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన స్వరాన్ని అదే రీతిలో కొనసాగిస్తే అది చంద్రబాబు కి కంటగింపు అవుతుంది. అలా కాకుండా గతంలో అనేక సమస్యల మాదిరిగా ప్రస్తావించి, ఆ తర్వాత మరచిపోయినట్టుగా ప్రస్తుత వ్యవహారంలో సైలెంట్ అయిపోతే మాత్రం అది జనసేనానికి సమస్య అవుతుది. దాంతో మిత్రపక్ష నేతకు కష్టం కలగకుండా పవన్ మౌనంగా ఉంటారా..లేక తన తరహాలో ప్రశ్నలకు పదును పెడతారా అన్నది చర్చనీయాంశం అవుతోంది.


Related News

jayaprakash narayan

జేపీకి అది ద‌క్కుతుందా?

Spread the loveలోక్ స‌త్తా అధినేత చూపులు హ‌స్తిన వైపు మ‌ళ్లాయి. ఢిల్లీ రాజ‌కీయాల వైపు ఆయ‌న చూస్తున్నారు. కానీRead More

shivaji

హీరో శివాజీపై బీజేపీ దాడి

Spread the loveబీజేపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. ప్ర‌త్యేక హోదా కోసం నిన‌దిస్తున్న వారిపై బౌతిక దాడులు ప్రారంభించారు. తాజాగా సినిమాRead More

 • బ్రేక‌ప్ కి బాబు డిసైడ్…!
 • క‌మల వ్యూహంలో టీడీపీ విల‌విల‌లాడాల్సిందేనా?
 • సంచలనంగా మారిన జగన్ ప్రకటన
 • పవన్ కి ప్రయాస తప్పదు..!
 • బాబుకి బడ్జెట్ భయం!
 • కేంద్రమంత్రి తీరుపై చంద్రబాబు గుర్రు..
 • బడ్జెట్ పై బాబు రెండు కళ్ల సిద్ధాంతం
 • సోము వీర్రాజుకి మళ్లీ నిరాశే..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *