ఏపీలో ఎన్నికలు జరుగుతాయా?

andhra_pradesh_ysrcp_tdp_bjp1478362766
Spread the love

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఆసక్తికర చర్చ మొదలయ్యింది. పల్లె పోరునకు సంబంధించిన వార్తలు జోరందుకుంటున్నాయి. పంచాయితీ ఎన్నికలకు సన్నాహాలంటూ ఎన్నికల అదికారులు కూడా హడావిడి చేస్తున్నారు. అయితే ఇప్పటికే ముగిసిన సహకార సంఘాల పాలకవర్గం కాలపరిమితిని పొడిగించిన ప్రభుత్వం, సహకార సమరం షురూ కాకుండా అడ్డుకుంది. ఇక పంచాయితీ పోరు కూడా అదే పద్ధతిలో బ్రేకులు వేస్తుందనే వాదన మొదలయ్యింది.

మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా 2016లో చంద్రబాబు వెంట పలువురు వైసీపీ నాయకులు నడిచారు. దానికి కారణం స్వయంగా సీఎం రంగంలో దిగి ఫిరాయింపులను ప్రోత్సహించడమే. దాంతో ఇక వైసీపీ ఎక్కడుంది..టీడీపీకి తిరుగులేదనే ధీమా పాలకపక్షంలో కనిపించింది. దుకాణం మూసుకోవాల్సిందేనంటూ టీడీపీ నేతలు మాటల దాడి కూడా చేశారు. ఆ తర్వాత 2017 వచ్చేసరికి టీడీపీ లో పెరిగిన ధీమా చివరకు బూమరాంగ్ అవుతుందనే సందేహాలు మొదలయ్యాయి. కానీ 2018 ప్రారంభం నుంచే బాబు ఫేట్ మారిపోయింది. వరుసగా జగన్, బీజేపీ, పవన్ కూడా చంద్రబాబు మీద అస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రత్యేక హోదా పుణ్యాన బాబు హోదా కోల్పోయే దశకు వచ్చేసింది. దాంతో ఇక అంతా జగన్ అని వైసీపీ శ్రేణులు కాన్ఫిడెన్స్ లో కనిపిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సమరానికి దిగడం చంద్రబాబు వల్ల సాధ్యమయ్యే పనికాదు. పంచాయితీల్లో పట్టు నిలుపుకోవాలంటే ప్రభుత్వానికి గట్టి సానుకూల వాతావరణం ఉండాలి. కానీ ప్రస్తుతం దానికి భిన్నమైన పరిస్థితులున్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ఎన్నికలకు వెళ్లే చేతులు కాల్చుకునే సాహసం చంద్రబాబుకి లేదని పలువురు పరిశీలకుల అబిప్రాయం. అయిితే ప్రజల నాడి గమనించడం కోసం ఓ ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. కానీ అది చివరకు అసలుకే ఎసరు తెచ్చే పరిస్థితి వచ్చి, పాలకపక్షానికి ఎదురుదెబ్బ తగిలితే దాని ప్రభావం సాధారణ ఎన్నికల మీద ఉంటుంది. దాంతో పంచాయితీ ఎన్నికలకు మరికొంత సమయం తప్పదనే భావించవచ్చు.


Related News

Paradise-Papers-Will-Narendra-Modi-Come-to-YS-Jagan-Rescue

బీజేపీతో వైసీపీ పొత్తు ఉంటుందా?

Spread the love5Sharesఇదో చర్చ సాగుతోంది. బీజేపీ, వైసీపీ మధ్య బంధం కొంత కాలంగా బలపడుతోంది. రాజకీయ అవసరాల రీత్యాRead More

ys jagan

జగన్ కి పెద్ద లోటు

Spread the love11Sharesప్రతీ నాయకుడు తెరమీద రాణించాలంటే తెరవెనుక చాలామంది శ్రమించాల్సి ఉంటుంది. కార్యకర్తల నుంచి వ్యూహకర్తల వరకూ అనేకRead More

 • నారా లోకేష్ కి అవార్డ్
 • ఏపీలో ఎన్నికలు జరుగుతాయా?
 • బీజేపీకి రాజీనామాలు
 • వైసీపీలో జగన్ ని మించిపోతున్న ఎంపీ
 • వైసీపీకి ‘కాపు’ కాచేనా…?
 • జ‌గ‌న్ కి జ‌న‌సేన‌ని ద‌గ్గ‌ర చేస్తున్న బాబు
 • బాబుని మోడీ లైట్ తీసుకుంటున్నారా…?
 • రాజీనామాకి రెడీ అయిన జ‌గ‌న్!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *