Main Menu

వెంట‌నే ఎన్నిక‌ల‌కు సై అన్న చంద్ర‌బాబు

Spread the love

ఏపీ సీఎం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఎన్నిక‌ల‌కు సై అన్నారు. ఎన్నిక‌ల‌కు తాము రెడీ అంటూ స్ప‌ష్టం చేసేశారు. హైకోర్ట్ ఆదేశాల నేప‌థ్యంలో పంచాయితీ ఎన్నిక‌ల‌కు తాము రెడీగా ఉన్నామ‌ని చెప్పేశారు. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన రిజ‌ర్వేష‌న్ల వ్య‌వ‌హారం కోర్ట్ ప‌రిధిలో ఉంద‌ని, అడ్డంకులు తొల‌గిపోతే వెంట‌నే ఎన్నిక‌ల‌కు వెళతామ‌ని ఆయ‌న తేల్చేశారు.

పంచాయితీ ఎన్నిక‌ల విష‌యంలో జాప్యం ప‌ట్ల హైకోర్ట్ ప్ర‌భుత్వ ఆదేశాల‌ను కొట్టివేసింది. మూడు నెల‌ల్లోగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశించింది. ఇప్ప‌టికే జ‌న‌సేన కూడా పంచాయితీ ఎన్నిక‌ల జాప్యం ప‌ట్ల ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. రాష్ట్ర వ్యాప్త ఆందోళ‌న‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌భుత్వం భ‌య‌ప‌డుతోందంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామెంట్స్ చేశారు.

ఈ నేప‌థ్యంలో స్థానిక పోరుకి సీఎం సై అన‌డం ఆస‌క్తిగా మారింది. గ్రామీణ ఆంధ్ర ప్ర‌దేశ్ ఓట‌ర్ల మ‌నోగ‌తం వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉండ‌డంతో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ప‌ల్లెపోరు తో రాజ‌కీయాలు వేడెక్కే అవ‌కాశం క‌నిపిస్తోంది.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *