కొత్త జిల్లాలకు చంద్రబాబు వెనకడుగు..

ap cabinet
Spread the love

ఏపీలో కూడా జిల్లాల విభజన అంశం తెరమీదకు వచ్చింది. తాజాగా సోషల్ మీడియాలో విస్త్రుతంగా ప్రచారం సాగుతోంది. పెద్దగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల విభజనకు తగ్గట్టుగా ముందుగా జిల్లాల విభజన చేస్తున్నారంటే వస్తున్న కథనాలు చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి.

దానికి కారణాలు లేకపోలేదు. వాస్తవానికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభనకు, జిల్లాలకు సంబంధమే లేదు. ఎన్ని జిల్లాలు ఉంటే అంత ఎక్కువగా అసెంబ్లీ స్థానాలుండాలనే వాదన అర్థరహితం. అదే సమయంలో జిల్లాల పెంపుదల విషయంలో చంద్రబాబు సర్కారు చాలాకాలంగా వెనకడుగు వేస్తోంది. గతంలోనే 14వ జిల్లాను ఏర్పాటు చేయాలని కొంత ప్రయత్నించింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం విలీన మండలాలను కలుపుకుని ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలను కలుపుకుని కొత్త జిల్లా కోసం కొంత ప్రయత్నం చేసినా చివరకు ఆగిపోయింది.

ఇక తాజాగా మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాలను విభజించాలనే ప్రతిపాదన వస్తుందంటూ సాగుతున్న ప్రచారాన్ని ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం కొట్టేసింది. పశ్నోత్తరాల సమయంలో అధికారికంగా రాతపూర్వక సమాధానం ఇస్తూ కొత్త జిల్లాల వాదనను తోసిపుచ్చింది. అయినా తాజాగా తెరమీదకు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కూడా చెబుతోంది. దానికి కారణం కూడా లేకపోలేదని చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీలో ఆర్థిక పరిస్థితికి తోడుగా, ఎన్నికల ముందు జిల్లాల విభజన తీసుకొస్తే అది రాజకీయంగా కొంత ఇబ్బందికరంగా మారవచ్చని కూడా అంచనా వేస్త్తున్నట్టు చెబుతున్నారు. అనేక ప్రతిపాదనలు ముందుకు రావచ్చని, సెంటిమెంట్ ముడిపెట్టవచ్చనే అంచనాలున్నాయి. ఏవిధంగా చూస్తున్నా చంద్రబాబు జిల్లాల విభజన పేరుతో కొత్త సమస్యలు నెత్తిన పెట్టుకోవడానికి సిద్ధంగా లేని సమయంలో ఇలాంటి ప్రచారం విశ్వసనీయం కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి.






Related News

jagancbn

బాబు, జగన్ కూడా అదే నియోజకవర్గంలో…

Spread the loveఏపీ ప్రతిపక్ష నేత ప్రజాసంకల్ప యాత్రలో ముందుకు సాగుతున్నారు. గడిచిన 60 రోజులుగా సాగుతున్న యాత్ర ఇప్పటికేRead More

chandrababu

పరువు కాపాడుకోవడానికి బాబు…

Spread the loveఅడుసు తొక్కనేల ..కాళ్లు కడగనేల అన్నట్టుగా మారింది చంద్రబాబు పరిస్థితి. మత్స్యకారులకిచ్చిన ఎన్నికల హామీని అమలుచేయమన్నందుకు ఆయనRead More

  • పవన్ మాట విని పరువు తీసిన చంద్రబాబు
  • ఆ లేఖ ఫేక్
  • జనసేనానికి తలైవా పాఠం?
  • పోలవరంలో కొత్త తగాదా
  • రాజమౌళికి షాకిచ్చిన రాజధాని
  • రంగంలోకి జేసీ సన్స్
  • కొత్త జిల్లాలకు చంద్రబాబు వెనకడుగు..
  • శ్రీలంకకు ఊరట విజయం
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *