Main Menu

ఫ‌లించిన చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు

Spread the love

ఎట్ట‌కేల‌కు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. న‌ష్ట నివార‌ణ జ‌రిగింది. దాంతో టీడీపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. బెజ‌వాడ‌కు చెందిన టీడీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి వైసీపీలో చేర‌డానికి జ‌రిగిన ప్ర‌య‌త్నాల‌కు అడ్డంకులు ప‌డ్డాయి. చంద్ర‌బాబు నేరుగా రంగంలో దిగి బుజ్జ‌గించ‌డంతో ఆయ‌న మెత్త‌బ‌డ్డారు. టీడీపీలో కొన‌సాగ‌డానికి అంగీక‌రించారు. చంద్ర‌బాబుని క‌లిసిన తర్వాత ఈ విష‌యాన్ని ర‌వి ప్ర‌క‌టించారు. ఎంపీ కేశినేని బుజ్జ‌గింపుల‌తో చంద్ర‌బాబుని క‌లిసిన ర‌వికి ఊర‌ట క‌లిగించే మాట‌లు రావ‌డంతో ఆయ‌న చ‌ల్ల‌బ‌డిన‌ట్టు తెలుస్తోంది.

దాంతో వైసీపీలో చేర‌డానికి రంగం సిద్ధం చేసుకున్న ర‌వి త‌న ప్ర‌య‌త్నాలు విర‌మించుకున్నారు. ఇది బెజ‌వాడ‌లో టీడీపీ కాస్త ఊర‌టనిచ్చే విష‌యంగా చెప్ప‌వ‌చ్చు. ప్ర‌స్తుతం ఏపీలో మారుతున్న రాజ‌కీయాల్లో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇలాంటి స‌మ‌యంలో బెజ‌వాడ లాంటి చోట కీల‌క సామాజిక‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు చేజారిపోతే టీడీపీ కి తీవ్ర న‌ష్టం ఖాయ‌మ‌నే ప్ర‌చారం సాగింది. దాంతో అలాంటి గండం నుంచి గట్టెక్క‌డం టీడీపీ వ‌ర్గాల‌ను సంతృప్తి ప‌రిచింది.






Related News

కోర్ట్ కి దూరంగా సీఎం చంద్ర‌బాబు

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఊహించిన‌ట్టుగానే కోర్ట్ కి హాజ‌రుకావ‌డం లేదు. ఆయ‌న కోర్టు మెట్లెక్కేందుకు సిద్ధ‌మంటూ వ‌చ్చిన ఊహాగానాల‌నుRead More

దేశంలోనే టాప్ 5లో జ‌గ‌న్

Spread the loveఏపీ విప‌క్ష నేత ఓ అరుదైన లిస్టులో చోటు సంపాదించారు. దేశంలోనే ఎమ్మెల్యేల జాబితాలో ఆయ‌న టాప్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *