అవిశ్వాసంపై మారిన సీన్

అవిశ్వాస తీర్మానంపై సీన్ మారింది. కొత్తగా మరికొన్ని పక్షాల్లో ఎంట్రీ ఇచ్చాయి. తాజాగా సీపీఎం కూడా సీన్ లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది. ఈ పరిణామాల తర్వాత ఎట్టకేలకు కేంద్రం మనసు మార్చుకుంది. అవిశ్వాసానికి సిద్దం అయ్యింది. ఎల్లుండే అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగబోతోంది. దాంతో తాజాగా ఏపీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి.
అవిశ్వాస తీర్మానంపై చర్చకు బీజేపీ సిద్ధమమయిన విషయాన్ని ఆపార్టీ నేత జీవీఎల్ నరసింహరావు మీడియాకి తెలిపారు. టీడీపీ తీరుని తప్పుబడుతున్న ఆయన చర్చ సందర్భంగా ఏపీకి తాము చేసిన సహాయాన్ని అధికారయుతంగా వెల్లడిస్తామన్నారు. తాము కూడా అవిశ్వాస తీర్మానంపై చర్చ కోసం ఆసక్తిగా ఉన్నామన్నారు. అదే సమయంలో టీడీపీ డ్రామాలు ఆడుతోందని విమర్శించిన జీవీఎల్ ..అమిత్ షా తనయుడిపై చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టారు. చంద్రబాబు అవివేకంతో వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాకమ్మ కబుర్లు చెబుతున్న చంద్రబాబు వ్యవహారాన్ని సబలో ఎండగడతామని తెలిపారు.
దాంతో అవిశ్వాసంపై పది రోజులుగా సాగుతున్న వ్యవహారానికి తెరపడినట్టవుతోంది. లైన్ క్లియర్ అయినట్టు స్పష్టం అవుతోంది. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలు ఏపీ ప్రజలకు తెలుగులోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా వ్యవహారం ఆసక్తిరేపుతోంది. అయితే రెండు రోజులుగా బీజేపీ అసమ్మతి నేతలతో అధిష్టానం జరిపిన చర్చలు ఫలించాయని సమాచారం. ముఖ్యంగా శత్రుఘ్ను సిన్హాతో పలువురు సీనియర్ మంత్రులు భేటీ అయ్యారు. అవిశ్వాసంపై ఓటింగ్ జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదనే విషయంలో అంగీకారం కుదిరినట్టు ఢిల్లీ వర్గాల భోగట్టా. ఆ ధీమాతోనే బీజేపీ నేతలు అవిశ్వాసానికి అంగీకరించినట్టు కనిపిస్తోంది. ఏం జరుగుతుందో మరో రెండు రోజుల్లో తేలబోతోంది.
Related News

బాబుని మోడీ లైట్ తీసుకుంటున్నారా…?
Spread the loveఏపీ సీఎం చంద్రబాబు తన పుట్టిన రోజు నాడు కూడా రిలేదీక్ష సాగిస్తున్నారు. భారీ ఏర్పాట్ల మధ్యRead More

రాజీనామాకి రెడీ అయిన జగన్!
Spread the loveఏపీ ప్రతిపక్ష నాయకుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా యోచనలో ఉన్నారు. ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్రలోRead More