నాన్ బెయిలబుల్ కేసులో జగన్ భార్య

jagan_bharati
Spread the love

ఏపీ ప్రతిపక్ష నాయకుడి భార్య కూడా కేసుల్లో ఇరుక్కున్నారు. వైఎస్ భారతికి ఏకంగా నాన్ బెయిలబుల్ ఆర్డర్ కూడా విడుదలయ్యింది. దాంతో ఇప్పుడీ వ్యవహారం ఆసక్తిగా మారింది. అయితే ఆమె కేసు సాధారణమయినదే కావడం విశేషం. అది కూడా రాజకీయ కారణాలతో టీడీపీ నేత పెట్టిన కేసులో కోర్ట్ కి హాజరుకాకపోవడంతోనే నాన్ బెయిలబుల్ వారెంట్ విడుదల కావడం గమనార్హం.

వైఎస్ జగన్‌ సతీమణి భారతీరెడ్డి సాక్షి పత్రిక ఎండీ గా ఉన్నారు. అయితే సాక్షి రాసిన కథనాలపై ఆమె మీద నుజివీడులో కేసు నమోదయ్యింది. ఆమెతో పాటు ఎడిటోరియల్ బోర్డ్ డైరెక్టర్ రామచంద్రమూర్తి కూడాఈ కేసులో ఉన్నారు. అయితే వీరిద్దరూ కోర్ట్ వాయిదాలకు హాజరుకాకపోవడంతో తాజాగా ఎన్బీడబ్ల్యూ విడుదలయ్యింది. గతంలో రాష్ట్రమంతా కలకలం రేపిన కాల్ మనీ కేసు దానికి మూలం కావడం విశేషం. ఆ కేసుకు సంబంధించిన వార్తల్లో తన పరువు తీశారంటూ టీడీపీ రైతు నాయకుడు వేసిన పిటీషన్ విచారణ భాగంగా ఈ నోటీసులు వచ్చాయి. తనపై అసత్యవార్తలు రాసారంటూ కృష్ణా జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు సాక్షి దినపత్రికపై నూజివీడు కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దాంతో ఇప్పుడు ఈ కేసు రాజకీయ కారణాలతో మీడియా పై వేసిన కేసుగా భావించవచ్చు.


Related News

shivaji

హీరో శివాజీపై బీజేపీ దాడి

Spread the loveబీజేపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. ప్ర‌త్యేక హోదా కోసం నిన‌దిస్తున్న వారిపై బౌతిక దాడులు ప్రారంభించారు. తాజాగా సినిమాRead More

cbn

బ్రేక‌ప్ కి బాబు డిసైడ్…!

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో కొత్త మ‌లుపు ఖాయంగా మారింది. చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. బీజేపీకిRead More

 • క‌మల వ్యూహంలో టీడీపీ విల‌విల‌లాడాల్సిందేనా?
 • సంచలనంగా మారిన జగన్ ప్రకటన
 • పవన్ కి ప్రయాస తప్పదు..!
 • బాబుకి బడ్జెట్ భయం!
 • కేంద్రమంత్రి తీరుపై చంద్రబాబు గుర్రు..
 • బడ్జెట్ పై బాబు రెండు కళ్ల సిద్ధాంతం
 • సోము వీర్రాజుకి మళ్లీ నిరాశే..
 • బాబు సందేహం ఎందుకో…?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *