గేరు మార్చిన ముద్ర‌గ‌డ

mudragada-and-wife
Spread the love

కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం గేరు మార్చేశారు. గ‌డిచిన కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న ముద్ర‌గ‌డ మ‌రోసారి స‌మ‌ర‌సంకేతాలు ఇచ్చేశారు. గ‌తంలోనే ప్ర‌క‌టించిన రీతిలో మార్చి నెల వ‌ర‌కూ చూసి కార్యాచ‌ర‌ణ‌లోకి దిగుతామ‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న దానికి త‌గ్గ‌ట్టుగా అడుగులు వేస్తున్నారు. తాజాగా కాపు జేఏసీ స‌మావేశం ఏర్పాటు చేశారు. కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ముద్ర‌గ‌డ రాజ‌కీయంగా దెబ్బ కొట్టాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు క‌నిపించారు. ముఖ్యంగా టీడీపీని సాగ‌నంపేద్దాం అనే ప్ర‌క‌ట‌న ద్వారా చంద్ర‌బాబుని ఓడించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. చంద్ర‌బాబు మీద కాపుల‌కు న‌మ్మ‌కం పోయింద‌ని తేల్చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో కాపుల‌ను బీసీ ఎఫ్ లో చేరుస్తామ‌ని చెప్పిన హామీ కోసం రోడ్డెక్కెస్తామ‌ని తేల్చేశారు. త‌ద్వారా కాపులంతా చంద్ర‌బాబుని ఓడించాల‌నే సంకేతం ఇచ్చేశారు.

ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంలో కూడా చంద్ర‌బాబు పాత్ర మీద ఆయ‌న విరుచుకుప‌డ్డారు. చంద్ర‌బాబు దీక్ష‌కు కూర్చోవాల‌న్నారు. మ‌ద్ధ‌తుగా తాను కూడా వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు. మొత్తంగా కాపు ఉద్య‌మం మ‌రోసారి ఆందోళ‌న రూపం దాల్చ‌డానికి స‌న్నాహాలు చేస్తూనే రాజ‌కీయంగా చంద్ర‌బాబుని దెబ్బ‌కొట్ట‌డానికి త‌గ్గ‌ట్టుగా ముద్ర‌గ‌డ పావులు క‌దుపుతున్నారు. ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క సామాజిక‌వ‌ర్గం కాపుల ప్ర‌తినిధిగా ముద్ర‌గ‌డ వైఖ‌రి రాజ‌కీయంగా ప్ర‌భావం చూప‌డం ఖాయం. దాంతో ఇప్ప‌టికే హోదా ఉద్య‌మంతో ఢీలా ప‌డిన టీడీపీకి ఈ ప‌రిణామం మింగుడుప‌డే అవ‌కాశం లేదు.


Related News

cbn deeksha

బాబుని మోడీ లైట్ తీసుకుంటున్నారా…?

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న పుట్టిన రోజు నాడు కూడా రిలేదీక్ష సాగిస్తున్నారు. భారీ ఏర్పాట్ల మ‌ధ్యRead More

YS-Jagan-Mohan-Reddy_0

రాజీనామాకి రెడీ అయిన జ‌గ‌న్!

Spread the love22Sharesఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న ప‌ద‌వికి రాజీనామా యోచ‌న‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌జాసంకల్ప‌యాత్ర‌లోRead More

 • గేరు మార్చిన ముద్ర‌గ‌డ
 • జగన్ ముందున్న అతి పెద్ద సవాల్ అదే..
 • హోరెత్తుతున్న హోదా
 • ఫ‌లించిన చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు
 • వైసీపీ పోరు కొత్తదారిలో…
 • స‌ర్వే: చంద్ర‌బాబుని వెన‌క్కి నెట్టిన జ‌గ‌న్
 • ఐదుగురు ఎంపీలే రాజీనామాలు!
 • ఇరుక్కున్న వైసీపీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *