Main Menu

బాబుకి మోడీ స‌మాధానం ఎలా ఉంటుంది?

Faridabad - Prime Minister Narendra Modi  during a workshop for the newly elected MPs at Suraj Kund in Faridabad on Saturday, 28 June 2014. (Photo by ARIJIT SEN . DNA)
Spread the love

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు కేంద్రం మీద ప్ర‌భావం చూప‌డం ఖాయంగా మారింది. తెలుగుదేశం త‌న వైఖ‌రి ప్ర‌క‌టించేసింది. ఎన్డీయేకి షాకిస్తూ బీజేపీకి రాంరాం చెప్పేయ‌బోతోంది. ఇప్ప‌టికే కేంద్ర క్యాబినెట్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. దాంతో మ‌హారాష్ట్రలో శివ‌సేన త‌ర‌హాలో ఎన్డీయేలో ఉంటూ బీజేపీని ఇబ్బంది పెడుతుంద‌నే చ‌ర్చ సాగుతోంది. అది సాధ్య‌మా..కాదా అన్న‌ది ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతానికి మాత్రం టీడీపీ శివ‌సేన త‌ర‌హా తీరులో సాగాల‌ని ఆశిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అయితే అది మోడీ వైఖ‌రి వెల్ల‌డ‌య్యే వ‌ర‌కూ మాత్ర‌మే సాధ్యం అని చెప్ప‌వ‌చ్చు. వాస్త‌వానికి మోడీ తాను కాద‌నుకున్న నేత‌ల‌నే వ‌దిలిపెట్ట‌డం లేదు. వివిధ కార‌ణాల‌తో వెంటాడి వేదించ‌డం ఆయ‌న నైజంగా ఉంది. అలాంటి స‌మ‌యంలో చంద్ర‌బాబు విష‌యంలో ఎలా స్పందిస్తార‌న్న‌ది ప్ర‌స్తుతానికి ఆస‌క్తిగా క‌నిపిస్తోంది.

వాస్త‌వానికి రాజీనామాల నిర్ణ‌యం తీసుకోగానే చంద్ర‌బాబు కూడా మోడీతో మాట్లాడాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ ప్ర‌ధాని మాత్రం ప‌ట్టించుకున్న పాపాన పోఏలుద‌. దాంతో ఏపీ సీఎం కి కేవ‌లం ఓఎస్డీ మాత్ర‌మే అందుబాటులోకి వ‌చ్చారు. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు కూడా మీడియా ముందు వెల్ల‌డించారు. అంతేగాకుండా బీజేపీ నేత‌ల‌తో ముందుగా రాజీనామాలు చేయించి బీజేపీ ఓ అడుగు వేసింది. అయిన‌ప్ప‌టికీ కేంద్రంలోని టీడీపీ మంత్రులు రాజీనామాలు చేయ‌డంలో తాత్సార్యం చేయ‌డం ఆశ్చ‌ర్యంగా క‌నిపిస్తోంది. బీజేపీ రాజీనామాలు ఆమోదం పొందిన త‌ర్వాత కూడా టీడీపీ నేత‌లు మోడీ కోసం ఎదురుచూస్తున్నామ‌ని చెప్ప‌డం విచిత్రంగా ఉంద‌నే వ్యాఖ్య‌లున్నాయి.

అయితే చంద్ర‌బాబు ఆశ‌లు పండవ‌ని ప‌లువురు భావిస్తున్నారు. ముఖ్యంగా మోడీ వ్య‌వ‌హార‌శైలి గురించి బాగా తెలిసిన నేత‌లంతా శివ‌సేన‌తో పోలిస్తే టీడీపీని తీవ్రంగా వేదించ‌డానికి త‌గ్గ‌ట్టుగా చ‌ర్య‌లుంటాయ‌ని భావిస్తున్నారు. దానికి ఎలాంటి మార్గం అనుస‌రిస్తార‌న్న‌దే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం దాంతో టీడీపీ ప‌ట్ల మోడీ వైఖ‌రి గురించి ఇప్పుడు ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు సాగుతున్నాయి.






Related News

bjp

పోల‌వ‌రంపై క‌న్నేసిన క‌మ‌ల‌నాధులు

Spread the loveఏపీ బీజేపీ నేత‌లు దూకుడు పెంచుతున్నారు. క్ర‌మంగా చంద్ర‌బాబు స‌ర్కారుపూఐ ఒత్తిడి పెంచే య‌త్నం చేస్తున్నారు. కొద్దికాలంRead More

telugudesam tdp

టీడీపీని బ‌హిష్క‌రించేశారు..!

Spread the loveఅధికార పార్టీని బ‌హిష్క‌రించారు. అది కూడా ఓ ప‌ట్ట‌ణంలోని పార్టీ కార్య‌క‌ర్త‌లు స‌మావేశం ఏర్పాటు చేసుకుని తీసుకున్నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *