Main Menu

ఓట‌మి అంచున మంత్రులు

Spread the love

సిట్టింగ్ సీట్ల‌లో ఏపీ క్యాబినెట్ మంత్రులు క‌ష్టాల్లో క‌నిపిస్తున్నారు. ఏటికి ఎదురీదుతున్నారు. ప్ర‌స్తుతం ముగ్గురు మంత్రులు పోటీకి దూరంగా ఉన్నారు. య‌న‌మ‌ల ఎమ్మెల్సీగా కొన‌సాగుతుండ‌గా, మంత్రులు కేఈ కృష్ణ‌మూర్తి, ప‌రిటాల సునీత త‌మ త‌న‌యుల‌కు టికెట్ ఇచ్చి, పోటీకి దూరంగా ఉన్నారు. ఇక మ‌రో ఇద్ద‌రు మంత్రులు ఆదినారాయ‌ణ రెడ్డి, శిద్ధా రాఘ‌వ‌రావు మాత్రం ఈసారి పార్ల‌మెంట్ బ‌రిలో ఉన్నారు.

ఎంపీ స్థానాల‌కు పోటీ చేస్తున్న ఇద్ద‌రు మంత్రులు చాలా వెనుక‌బ‌డి ఉన్నారు. దాదాపు ఓట‌మి అనివార్యంగా క‌నిపిస్తోంది. ఇక అసెంబ్లీ బ‌రిలో ఉన్న మంత్రుల్లో ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు కిమిడి క‌ళా వెంక‌ట్రావు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం ఎచ్చెర్ల‌లో ఏటికి ఎదురీదుతున్నారు. మ‌రో మంత్రి అర‌కు నుంచి కిడారి శ్ర‌వ‌ణ్ కుమార్ క‌ష్టాల్లో ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి పోటీలో ఉన్న మంత్రులు కే ఎస్ జ‌వ‌హార్, దేవినేని ఉమా కూడా వెనుక‌బ‌డి ఉన్నారు.

క‌ర్నూలు జిల్లా మంత్రి ఆళ్ల‌గ‌డ్డ నుంచి భూమా అఖిల‌ప్రియ దాదాపుగా ఓట‌మి ఖాయ‌మ‌నే ప‌రిస్థితిలో క‌నిపిస్తున్నారు. అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం నుంచి కాలువ శ్రీనివాసులు కూడా అదే ప‌రిస్థితిలో ఉన్నారు. ఇక స‌ర్వేప‌ల్లి లో మంత్రి సోమిరెడ్డి ఓట‌మి అనివార్యం అనే ద‌శ‌లో ఉన్నారు.

గుంటూరు జిల్లాలో మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు , విశాఖ నార్త్ నుంచి రంగంలో ఉన్న గంటా శ్రీనివాస‌రావు, , మంగ‌ళ‌గిరిలో నారా లోకేశ్, నెల్లూరు అర్బ‌న్ లో పి నారాయ‌ణ మాత్రం తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. ఇక టెక్క‌లిలో అచ్చెన్నాయుడు, పెద్దాపురంలో చిన‌రాజ‌ప్ప‌, ఆచంట‌లో పితాని స‌త్య‌న్నారాయ‌ణ‌, మ‌చిలీప‌ట్నంలో కొల్లి రవీంద్ర‌, వేమూరులో నక్కా ఆనంద్ బాబు, ప‌ల‌మ‌నేరులో అమ‌ర్ నాథ్ రెడ్డి, బొబ్బిలిలో సుజ‌య కృష్ణ రంగారావు వంటి వారు ప్ర‌స్తుతానికి సేఫ్ జోన్ లో క‌నిపిస్తున్నారు. రాబోయే ప‌ది రోజుల్లో ఈ ప‌రిస్థితి తారుమార‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని ప‌లువురు అంచ‌నాలు వేస్తున్నారు. దాంతో ఫ‌లితాల ప‌ట్ల ఆస‌క్తి పెరుగుతోంది. కీల‌క నేత‌లు వెనుక‌బ‌డి ఉండ‌డం టీడీపీని క‌ల‌వ‌ర‌పెడుతోంది.

మంత్రుల వార‌సులుగా రంగంలో ఉన్న వారిలో ప‌త్తికొండ‌లో కేఈ శ్యాంబాబు ఓట‌మి బాట‌లో ఉండ‌గా, రాప్తాడులో పరిటాల శ్రీరామ్ పోరాడుతున్నారు.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *