Main Menu

మంత్రికి మంట పెడుతున్న తెలుగుతమ్ముళ్లు

Spread the love

తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు తగాదాల మయంగా మారుతున్నాయి. అంతా బాగుందని అంచనాలు వేస్తున్న అనంతపురంలో కూడా ఈసారి అధికార పార్టీకి చుక్కలు కనిపించేలా ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీలో నేతల మధ్య విబేధాలు చివరకు అమాత్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. మంత్రి కాలువ శ్రీనివాసులకు మంట పెడుతున్నట్టు కనిపిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్‌ ఇవ్వాలంటూ రాయదుర్గం నియోజకవర్గంలో మండలాల వారీగా తమ అనుచరుల ద్వారా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి కాలవ శ్రీనివాసులుకు టికెట్‌ ఇస్తే తాము సహకరించబోమని హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై కాలవ శ్రీనివాసులు స్పందించకుండానే తనపని తాను చేసుకుపోతున్నారు. ఆ యోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం కీలకంగా ఉన్నందున మంత్రి కాలవ కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి కుటుంబీకులను టీడీపీలో చేర్చుకోవడం ద్వారా దీపక్ రెడ్డికి చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ పరిణామాలతో దీపక్ రెడ్డి మరింత అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్టు కనిపిస్తోంది. గతంలో తన మీద కేసులు రాగానే సస్ఫెండ్ చేయించడానికి కాలవ ప్రయత్నించారని, దానికి ప్రతీకారం తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయదుర్గం వ్యవహారాలు రంజుగా మారుతున్నాయి. తెలుగు తమ్ముళ్ల మధ్య క్యాంప్ రాజకీయాలతో కాక పుడోతంది. కాగా, ఈనెల 1న దీపక్‌రెడ్డి అనుచరులు, మండల టీడీపీ నాయకులు ఆదెన్న, రంగారెడ్డి, ప్రసాద్‌ తదితరులు తమ అనుచరులతో మంత్రికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. గుమ్మఘట్ట మండల టీడీపీ నాయకులు రాజేష్‌, ఓబానాయక్‌, మారెన్న తదితరులు ఆదివారం తమ అనుచరులతో రాయదుర్గంలో సమావేశం నిర్వహించి వచ్చే ఎన్నికల్లో దీపక్‌రెడ్డికి టీడీపీ టికెట్‌ ఇవ్వాలని డిమాండు చేశారు.






Related News

త‌మ్ముళ్ల‌కు ‘మెగా’ ఝ‌ల‌క్

Spread the loveమెగాస్టార్ ఝ‌ల‌క్ ఇచ్చారు. సోద‌రుల ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లారు. కుటుంబ‌మంతా ఒక్క‌టేన‌ని చాటేందుకు చిరంజీవితో ఓ ప్రెస్Read More

వైసీపీ హోరు గాలి, టైమ్స్ నౌ తాజా స‌ర్వే

Spread the loveజాతీయ మీడియా సంస్థ‌ల స‌ర్వేల‌లో వైసీపీ హోరు గాలి వీస్తోంది. ఆపార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఖాయంగా క‌నిపిస్తోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *